వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

130 ఏళ్లుగా కొనసాగుతున్న దుష్టశక్తుల దహన ఉత్సవం..ఈ సారి ఎవరిని కాల్చారంటే..?

|
Google Oneindia TeluguNews

నాగ్‌పూర్: నాగ్‌పూర్‌లో ప్రతి ఏటా దుష్టశక్తులను దహించివేసే ఉత్సవం ఒకటి అక్కడి స్థానికులు జరుపుతారు. ఈ ఉత్సవం పేరు కాళీ పివిలి లేదా పిలి మార్‌బత్స్ అని పిలుస్తారు. అంటే సమాజంలో ఉన్న దుష్ట శక్తుల దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. అంతేకాదు ఇలా దహించివేయడం వల్లా దురాత్మలు తమ దరిచేరవనేది వారి విశ్వాసం. ఇది గత 130 ఏళ్లుగా జరుగుతోంది. ముందుగా బ్రిటీషు వారి నుంచి విముక్తి కోరుతూ ఈ దిష్టిబొమ్మలను దహనం చేసేవారు. అయితే ఈ సంవత్సరం ఈ ఉత్సవంలో ఓ ప్రత్యేకత చోటుచేసుకుంది.

ఈ ఏడాది జరిగిన కాళీ పివ్లీ ఉత్సవంలో అక్కడి స్థానికులు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు దిష్టి బొమ్మను ఊరేగించారు. 1881లో అప్పటి బ్రిటీషు వారిని దుష్టశక్తులతో పోలుస్తూ నాగ్‌పూర్ వీధుల్లో పెద్ద ఎత్తున స్థానికులు దిష్టిబొమ్మను ఊరేగించారు. కాళీ మరబాత్‌ను తన్హానే తేలి సమాజ్ ప్రారంభించింది.

Imran Khans effigy burnt in this 130 year old Nagpur tradition

ఇక దిష్టి బొమ్మలను మట్టితో తయారు చేస్తారు. వీటిని నాగ్‌పూర్‌లోని జగన్నాథ్ బుద్వారీలోని పిలి మరబత్ ఆలయంలో చేస్తారు. ఆ తర్వాత ఈ మట్టి బొమ్మలను నాగ్‌పూర్‌ వీధుల్లో ఊరేగించి నాయిక్ తలావ్ దగ్గరకు చేరుకోగానే అక్కడే దహన కార్యక్రమం చేస్తారు. ఊరేగింపు సమయంలో భక్తులు మానవాళికి నష్టం కలిగించే దుష్టశక్తులు నాశనం కావాలంటూ నినాదాలు చేస్తారు. ఇక ఊరేగింపు నెహ్రూ పుట్లా స్క్వేర్‌కు చేరుకోగానే దిష్టి బొమ్మలను దహించి వేస్తారు. ఆ సమయంలో పూలు విసురుతారు.

English summary
Thousands gathered today in Nagpur to take out the procession of effigies called Kali Pivli or Pili Marbats that represent evil forces. However, this year, the devotees also burnt the effigy of Pakistan Prime Minister Imran Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X