వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను బద్నాం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన ఇమ్రాన్ ఖాన్..

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లోని సిక్కుల ఆలయం గురుద్వారా నంకనా సాహిబ్‌పై రాళ్ల దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. తక్షణం అక్కడికి సిక్కులకు భద్రతను కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత్ ఈ ప్రకటన చేయగానే పాకిస్తాన్ మరో రీతిలో స్పందించింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఎప్పుడో ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పోలీసులు ముస్లింలపై చేసిన దాడుల వీడియోను ట్వట్టర్‌లో పోస్టు చేశారు. సీఏఏని వ్యతిరేకిస్తున్నందుకు ఉత్తరప్రదేశ్‌లోని ముస్లింలపై అక్కడి పోలీసులు సాగిస్తున్న దమనకాండ అంటూ ట్వీట్ చేశారు. అయితే అది ఫేక్ వీడియో అని తేలడంతో వెంటనే డిలీట్ చేశారు.

సిక్కు ఆలయంపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ భారత్ తక్షణ చర్యలకు డిమాండ్ చేయగా.. దానిపై స్పందించాల్సిందిపోయి ఇమ్రాన్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఎప్పుడో బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనను భారత్ పేరుతో ట్విట్టర్‌లో పోస్ట్ చేసి దేశాన్ని బద్నాం చేయాలనుకున్నాడు. ఆ వీడియోలో పోలీసులు ధరించిన యూనిఫాంపై ఉన్న 'RAB'అని రాసి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. దాని అర్థం రాపిడ్ యాక్షన్ బెటాలియన్,దీన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తే బంగ్లాదేశ్‌కి చెందినదిగా చూపిస్తోంది.

Imran Khan tries to expose police atrocities on Muslims in UP with fake video deletes tweet later

కాగా, మే 6,2013లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో తీవ్ర హింస చెలరేగింది. ఇస్లాం మతాన్ని,మహమ్మద్ ప్రవక్తను కించపరిచేవారిని శిక్షించేందుకు దైవదూషణ చట్టాన్ని అమలుచేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వేలాది మంది ఇస్లాం మతచాంధసవాదులు ఢాకాలో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో పోలీసులు ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపారు. ఆనాటి ఆందోళనకు సంబంధించిన వీడియోనే తాజాగా ఇమ్రాన్ ఖాన్ భారత్ పేరుతో పోస్టు చేసి దొరికిపోయారు.

English summary
Pakistan Prime Minister Imran Khan on Friday tweeted a video 'exposing' "Indian police's pogrom against Muslims in UP". However, the video shared by the Pakistan PM is seven years old from Dhaka in Bangladesh and not India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X