• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Drugs case:డొంక కదులుతోంది.. ఈసారి దీపికా మెడకు.. త్వరలో సమన్లు, కంగనా ఫైర్..!

|

బాలీవుడ్‌లో డ్రగ్స్ కంపు కొనసాగుతోంది. సుషాంత్ సింగ్ మరణంతో ప్రారంభమైన విచారణ క్రమంగా డ్రగ్స్ వైపు మరలింది. బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున్న డ్రగ్స్ సామ్రాజ్యం నడుస్తోందని ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి చెప్పిన విషయాల ద్వారా వెల్లడవుతోంది. ఇక విచారణలో భాగంగా రోజు రోజుకూ ఓ కొత్త పేరు బయటకు వస్తోంది. ఆ పేర్లు కూడా సామాన్యమైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారు ఈ డ్రగ్స్ కేసులో ఉండటం పెద్ద చర్చకు దారి తీస్తోంది. తాజాగా ఈ గలీజ్ దందాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకోన్ పేరు బయటకొచ్చింది.

  Deepika Padukone : మాల్ ఉందా..? Deepika Padukone.. వాట్సాప్ చాట్‌ లీక్! || Oneindia Telugu
   దీపికా కూడా అలాంటిదేనా..

  దీపికా కూడా అలాంటిదేనా..

  డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గంట గంటకు కొత్త పేరు బయటకు వస్తుండటంతో ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు వణుకుతున్నారు. రియా చక్రవర్తి అరెస్టుతో పలువురు హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా దీపికా పదుకోన్ పేరు డ్రగ్స్ వ్యవహారంలో బయటకు వచ్చింది. దీపికాకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని వాట్సాప్‌ చాట్ ద్వారా బయటపెట్టింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. వాట్సాప్ చాట్‌లో 'k' అనే వ్యక్తితో తనకు సరకు కావాలంటూ దీపికా అడిగినట్లు సమాచారం. అయితే దీపికా అడిగినట్లుగా 'k' ఎవరని ఆరా తీయగా ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌గా ఎన్‌సీబీ గుర్తించింది. కరిష్మాకు వెంటనే విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది.

   డొంక కదులుతోంది..

  డొంక కదులుతోంది..

  2017 అక్టోబర్ 28న దీపికా ఆమె మేనేజర్ కరిష్మాల మధ్య ఈ చాటింగ్ వ్యవహారం నడిచింది. ఇందులో దీపికా తనకు హాష్ కావాలని వీడ్ వద్దని అడిగినట్లు చాట్ ద్వారా తెలుస్తోంది. ఆ రోజు జరిగిన చాట్‌లో తనకు మాల్ కావాలని అడుగగా ప్రస్తుతం అది ఇంట్లో ఉందని తాను వేరే చోట ఉన్నట్లు కరిష్మా జవాబు ఇచ్చింది. అమిత్ అనే వ్యక్తితో పంపించాలా అని అడిగినప్పుడు అందుకు దీపికా సరే అని చెప్పినట్లు చాట్ ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత కోకోకు ఎప్పుడొస్తావ్ అని దీపికాను కరిష్మాను అడిగింది. దీనికి రాత్రి 11:30 లేదా 12 గంటలకు వస్తానంటూ దీపికా సమాధానం చెప్పింది. కోకో అంటే కమలామిల్స్ ప్రాంతంలో ఉండే ఓ రెస్టారెంట్. ఈ చాటింగ్ వ్యవహారం మొత్తంను ఎన్‌సీబీ డీ కోడ్ చేసింది. ఇక కరిష్మాకు నోటీసులు పంపింది. ఏ క్షణమైనా దీపికాకు కూడా నోటీసులు అందే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  పైకి పెద్ద మనుషులు లోపల మాత్రం..

  పైకి పెద్ద మనుషులు లోపల మాత్రం..

  ఇక దీపికా వ్యవహారంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఒకప్పుడు మానసిక వ్యాధులపై "రిపీట్ ఆఫ్టర్ మీ" పేరుతో ప్రచారం నిర్వహించింది దీపికా. ఇప్పుడు అదే పేరుతో కంగనా ట్వీట్ చేసింది. సమాజంలో గొప్పింటి పిల్లలుగా చలామణి అవుతూ మేనేజర్లను మాల్ ఉందా అని అడిగే స్థాయికి దిగజారిపోయారంటూ కంగనా ఎద్దేవా చేసింది. డ్రగ్స్ పై లెక్చర్లు ఇచ్చిన వారే అదే డ్రగ్స్ కేసులో బయటపడటం విడ్డూరంగా ఉందని కంగనా ఫైర్ అయ్యింది. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి గలీజ్ పనులని కంగనా రనౌత్ దీపికా పై మండిపడింది.

   నెటిజెన్లు ట్రోలింగ్

  నెటిజెన్లు ట్రోలింగ్

  ఇక దీపికా పదుకోన్ పేరు బయటకు రావడంతో ఆమెపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో బాయ్‌కాట్ దీపికా అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్‌లోని చీకటి కోణం క్రమంగా బయటపడుతోందని ఇంకా చాలా పెద్ద తలకాయలే ఇందులో ఉంటాయని విచారణ పారదర్శకంగా సాగితే వారి పేర్లు కూడా బయటకు వస్తాయంటూ నెటిజెన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధ కపూర్, సారా అలీఖాన్ పేర్లు బయటకు రావడంతో త్వరలోనే వారికి ఎన్‌సీబీ నోటీసులు పంపనుంది. మొత్తానికి ఈ డ్రగ్ వ్యవహారం ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటపెడుతుందో తెలియాలంటే ఈ ఎపిసోడ్‌ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే.

  English summary
  In a huge development in Bollywood drugs case star Actress Dipika's name surfaced after NCB decoded the whatsapp Chat.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X