• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతటి గాన గంధర్వుడికే గొంతు అరువు - ఎస్పీ బాలు లైఫ్‌లో అరుదైన ఘటన - సుఖ్విందర్ ఎంత లక్కీ!

|

దశాబ్దాల పాటు తెలుగు సంగీత సామ్రాజ్యానికి రారాజుగా కొనసాగాడు... దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ పాటలు పాడి యావత్ దేశాన్ని అలరించాడు.. సుదీర్ఘ కెరీర్ లో 40వేలకుపైగా పాటలు.. వందలకొద్దీ సినిమాలకు డబ్బింగ్.. గడిచిన 50 ఏళ్లలో సినీ సంగీతం కొత్త మలుపులు తీసుకున్న ప్రతి సందర్భం ఆయన ద్వారానే జరిగిందంటే అతిశయం కాదేమో. నటుడిగానూ పదుల కొద్ది సినిమాలు చేసిన ఆయన తన పాటలకు తానే యాక్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ అంతటి గాన గాంధర్వుడే వేరే గొంతును అరువు తీసుకున్న సందర్భం మాత్రం ఒకేసారి చోటుచేసుకుంది. అది లెజెండరీ బాలు జీవితంలో అత్యంత అరుదైన ఘటనగా మిగిలిపోయింది..

సెక్స్‌లో ఈ కండోమ్స్ వద్దు - అన్నీ వాడి పారేసినవే - నీళ్లలో మరగబెట్టి తిరిగి అమ్మకం - మహిళ అరెస్ట్

ఆయన లేరు.. పాట మిగిలింది..

ఆయన లేరు.. పాట మిగిలింది..

బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) ఇక లేరు. ఆయన పాట మాత్రమే మిలిపోయింది. నెలన్నరకుపైగా కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. దేశంలోనే పేరెన్నికగల బాలు మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎస్పీబీకి కన్నీటి నివాళ్లులు, సంగీతపు వీడ్కోల్లతో మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియా హోరెత్తిపోతున్నది. బాలు జీవితంలో చోటు చేసుకున్న ఆ అరుదైన సందర్భానికి వస్తే..

 బాలుకు వేరే వాళ్ల గొంతా?

బాలుకు వేరే వాళ్ల గొంతా?

సినిమా సంగీతంలో నాలుగో తరానికి చెందిన ఏఆర్ రెహమాన్ సరికొత్త ప్రయోగాలు, వినూత్న ఆవిష్కరణకు కేరాఫ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి సినిమా రోజా నుంచే రెహమాన్ ను ప్రోత్సహిస్తూ తనదైన సహకారం అందిస్తూ వచ్చారు లెజెండరీ బాలు. అప్పటికే ఎస్పీబీతో పలు ప్రయోగాలు చేయించిన ఏఆర్.. 1997లో వచ్చిన ‘రక్షకుడు'(తమిళంలో ‘రచ్చగన్') సినిమాకు సంబంధించి ఎవరూ ఊహించని స్టెప్ తీసుకున్నారు. రక్షకుడు సినిమాలో హీరో నాగార్జునకు తండ్రిగా ఎస్పీ బాలు నటించారు. ఓ సందర్భంలో వచ్చే పాట మొత్తం ఎస్పీ బాలు చుట్టూ తిరుగుతుంది. ఆ పాటను పాడిన వాళ్లలో బాలు కూడా ఉన్నప్పటికీ.. స్క్రీన్ మీద బాలుకు వేరే వాళ్ల గొంతు పెట్టడం గమనార్హం..

సుఖ్విందర్ ఎంత లక్కీ..

సుఖ్విందర్ ఎంత లక్కీ..

వేల పాటలు పాడి లెజెండరీగా పేరుతెచ్చుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గొంతు అరువిచ్చిన అదృష్టం పంజాబీ సింగర్ సుఖ్విందర్ సింగ్ కు దక్కింది. రక్షకుడు సినిమాలో బాలు(హీరో తండ్రి) కోసం సుఖ్విందర్ పాట పాడారు. ‘‘లక్కీ లక్కీ.. '' అంటూ సుఖ్వీందర్ గొంతును ఇమిటేట్ చేస్తూ బాలు నటించడం అత్యంత అరుదైన సందర్భమనే చెప్పాలి. నిజానికి ఆ పాటలో ఎస్పీబీ స్వరం కూడా ఉంటుంది. అయితే దాన్ని నాగార్జున(హీరో)కు పెట్టారు. గాన గంధర్వుడికి గొంతు ఇవ్వడం నిజంగా తన పూర్వజన్మ సుకృతమని ఆ సందర్భంలో సుఖ్విందర్ చెప్పుకున్నాడు. మరో అరుదైన సందర్భం చెప్పుకోవాలంటే..

 ఒకే సినిమాలో 8 పాత్రలకు డబ్బింగ్..

ఒకే సినిమాలో 8 పాత్రలకు డబ్బింగ్..

నటుడు కమల్ హాసన్ తో ఎస్పీ బాలుది గాఢమైన అనుబంధం. కమల్ నటించిన సినిమాలు చాలావాటికి తెలుగులో బాలూనే డబ్బింగ్ చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి ఒకే నటుడు 10 పాత్రల్లో కనిపించిన దశావతారం సినిమా తెలుగులో పండటానికి బాలూనే ప్రధాన కారణం. ఆ సినిమాలో 8 పాత్రలకు బాలూనే డబ్బింగ్ చెప్పారు. అమెరికన్, జపనీస్ క్యారెక్టర్లకు మాత్రం కమల్ సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆ ఎనిమిది పాత్రల్లో బామ్మ క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పడానికి కొంత కష్టపడాల్సి వచ్చిందని బాలు పలు ఇటర్వ్యూల్లో తెలిపారు.

మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే

English summary
Legendary singer SP Balasubrahmanyam dies at 74 in Chennai mgm hospital on friday. his fans around the globe in sad movements. in a rare incident in his long music career, sukhwinder singh gave voice to legendary sp balasubrahmanyam. it happens in rakshasudu (Ratchasan in tamil) movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X