వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాయుసేన అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రం..! భారత్ చేరుకున్న 'అపాచీ' యుద్ద హెలికాప్టర్..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : భారత వాయుసేన అమ్ములపొదిలో ఓ కీలక అస్త్రం చేరింది. అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఏళ్లుగా విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న అపాచీ అటాకింగ్ హెలికాప్టర్లు ఇకపై భారత్ వాయుసేనలో కూడా తమ ప్రాభవాన్ని చాటనున్నాయి. 2015లో అమెరికా, భారత్ మధ్య 22 అపాచీ హెలికాప్టర్ల విక్రయానికి ఒప్పందం కుదరగా, శుక్రవారం భారత్ కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ ను అప్పగించారు. ఆరిజోనాలోని బోయింగ్ సంస్థ ఉత్పత్తి కేంద్రంలో ఈ అపాచీ హెలికాప్టర్ ను ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలాకు అందజేశారు. ఈ మేరకు భారత వాయుసేన ట్వీట్ చేసింది.

యూఎస్‌ నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2015 సెప్టెంబరులో ఐఏఎఫ్‌.. అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది జులై నాటికి తొలి విడత హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. అపాచీ హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులపై దాడులు చేయగలవు. గగనతలం, భూతలం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగల సత్తా అపాచీ హెలికాప్టర్లకు ఉంది.

In Air Force the undisputed weapon.!Apache war helicopter arrives in India.!!

ఒక్కసారి యుద్ధరంగంలో దిగిన తర్వాత అందుబాటులో ఉన్న డేటా నెట్వర్కింగ్ వ్యవస్థల నుంచే కాకుండా, ఇతర ఆయుధ వ్యవస్థల నుంచి కూడా స్వయంగా సమాచారం సేకరించడం, ఇతర వ్యవస్థలకు చేరవేయడం అపాచీ హెలికాప్టర్లకు మాత్రమే ఉండే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంగా యుద్ద విమానాల్లో పనిచేసే సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

English summary
Apache's attacking helicopters, which have been serving America for many years, will now showcase their potential in the Indian Air Force. In 2015, 22 Apache helicopters were signed between America and India, and India was given the first Apache Guardian Attack helicopter on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X