వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీధికుక్కల స్వైరవిహారం : భోపాల్‌లో ఆరేళ్ల బాలుడి మృతి

|
Google Oneindia TeluguNews

భోపాల్ : ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకోవడమే ఆ చిన్నారి పాలిట శాపమైంది. మృత్యువులా వెంబడించిన వీధికుక్కలు బాలుడిని వదిలిపెట్టలేదు. పీక్కుతిన్నాయి .. ఇంతలో తండ్రి వచ్చినా .. బాలుడిని కాపాడేందుకు తల్లి పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ హృదయ విదారకర ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది.

కుక్కల దాడి .. బాలుడి మ‌ృతి
అవాధ్ పురి ప్రాంతంలో సంజు పేరెంట్స్ తో కలిసి ఉంటున్నాడు. నెల క్రితం సంజు తల్లి డెలివరీ అయ్యింది. తండ్రి ఆఫీసుకు వెళ్లగా .. ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు కానీ కుక్కలు సంజును చుట్టుముట్టాయి. ఆ బాలుడు పద్మవ్యుహంలో చిక్కిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలో తండ్రి ఆఫీసు నుంచి వచ్చి బాలుడి గురించి అడగడం .. ఆడుకుంటున్నారని తల్లి చెప్పింది. అయితే బయటకొచ్చి చూసి ఖంగుతినడం వారి వంతైంది.

in bhopal dog bite chlid, die

కొడుకును కాపాడేందుకు విశ్వప్రయత్నం
సంజును వీధికుక్కలు చుట్టుముట్టాయని చెప్పడంతో ఆ బాలింత తన కొడుకును కాపాడేందుకు పరుగు తీసింది. సంజును కాపాడమని ఆరిచింది. చుట్టుపక్కల వారు వచ్చిన ఫలితం లేకపోయింది. అప్పటికే తీవ్రగాయాలై సంజు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా .. ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

English summary
In the Avadh Puri area he is staying with Sanju Parents. Sanju became mother delivery month ago. The father is going to the office and is playing a vacant space in front of the house. Meanwhile the dogs do not know where they come from but the dogs surround the sand. Meanwhile the mother said that the father was coming from the office and asking about the boy. But they got out and looked at their disappearance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X