వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కూటర్ 50 వేలు: ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 8 లక్షలు ఖర్చు..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చంఢీగడ్: ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. కానీ యాభై వేలు ఖరీదు చేసే యాక్టివా స్కూటరుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం చంఢీగడ్‌లో ఓ వ్యాపారి లక్షలు ఖర్చు పెట్టాడు. వివరాలిలా ఉన్నాయి. హర్యానాలోని చంఢీగడ్‌కు చెందిన వ్యాపారవేత్త కన్వల్జిత్ వాలియా రూ. 8.1 లక్షలు చెల్లించి వీఐపీ ప్యాన్సీ నెంబర్ సీహెచ్ 01 బీసీ 0001ను కొనుగోలు చేశారు.ఈ వేలం పాటను చంఢీగడ్ లైసెన్సింగ్ అధారిటీ శనివారం నిర్వహించింది.

దీంతో పాటు వాలియా తన కుమారుడి కొనిచ్చిన కొత్త బైకుకు సీహెచ్ 01 బీసీ 0011 అనే నెంబర్ కోసం రూ. 2.6 లక్షలు వెచ్చించి వేలంపాటలో కోనుగోలు చేశారు. అంతే కాదు వాలియా ఇంట్లో ఉన్న అన్ని వాహనాలకు కూడా ప్యాన్సీ నెంబర్లు ఉండటం విశేషం.

అంతక ముందు వేలంపాటలో తన ఎస్‌యూవీ కోసం సీహెచ్ 01 బీసీ 0026 అనే నెంబర్‌ను కోనుగోలు చేశాడు. ఇలా మొత్తం ఫ్యాన్సీ నెంబర్ల కోసం గాను వాలియా చెల్లించిన మొత్తం అక్షరాలా రూ. 8 లక్షలు. ఈ సందర్భంగా వాలియా మాట్లాడుతూ మా తండ్రి వద్ద రెండు ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయని తెలిపారు.

In Chandigarh, Man Pays 8.1 Lakh for a VIP Number For Rs. 50,000 Scooter

చంఢీగడ్ ట్యాక్సీ యూనియన్‌కు తన తండ్రి మొట్టమొదటి ప్రెసిడెంట్ అని పేర్కొన్నాడు. ప్రజల్లో ఈ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజీని దృష్టిలో పెట్టుకుని శనివారం చంఢీగడ్ లైసెన్సింగ్ అధారిటీ నిర్వహించిన వేలం పాటలో రూ. 77.77 లక్షలు ఆర్జించింది.

'0001' ఈ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి నెంబర్స్ కోసం చాలా మంది సుమారు రూ. 70,00 నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. 2010లో జరిగిన వేలంపాటలో షేర్‌గిల్ అనే ఓ రియల్టర్ అత్యధిక ధరను చెల్లించి '0001'ను కైవసం చేసుకున్నాడు.

English summary
A Chandigarh-based businessman has splurged a whopping Rs. 8.1 lakh on a VIP number for his scooter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X