చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీన్స్ ధరించిన అమ్మాయిలకు డ్రైవింగ్ టెస్ట్ కు నో ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: జీన్స్ ధరించిన అమ్మాయిలు డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వట్లేదు చెన్నై ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు. జీన్స్ ధరించిన అమ్మాయిలు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లగా..టెస్ట్ కు ముందే వారిని వెనక్కి పంపించేస్తున్నారు. చెన్నైలోని కేకే నగర్ ప్రాంతీయ రవాణాశాఖ (ఆర్టీఓ)లో కొద్దిరోజుల నుంచి ఇదే తీరు కొనసాగుతోంది. జీన్స్, టాప్ ధరించి వచ్చిన అమ్మాయిలను డ్రైవింగ్ టెస్ట్ కు నిరాకరిస్తున్నారు అక్కడి మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు. సంప్రదాయబద్ధమైన దుస్తులు లేదా పంజాబీ, సల్వార్ కమీజ్ లను ధరించి వస్తేనే డ్రైవింగ్ టెస్ట్ లను నిర్వహిస్తున్నారని బాధిత యువతులు వాపోతున్నారు.

హిందూ మహాసభ నాయకుడి హత్య వెనుక రైల్వే ఉద్యోగి హస్తం: సిమి మాజీ కార్యకర్తగా: హుబ్బళ్లితో కనెక్షన్హిందూ మహాసభ నాయకుడి హత్య వెనుక రైల్వే ఉద్యోగి హస్తం: సిమి మాజీ కార్యకర్తగా: హుబ్బళ్లితో కనెక్షన్

కిందటి నెల 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వాహన చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగానే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేకే నగర్ ఆర్టీఓ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. దీనిపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. అలాంటి నిబంధన ఏదీ కొత్త వాహన చట్టంలో లేదని వాదిస్తున్నారు యువతులు. ఇదే తరహా నిబంధన యువకులకు ఎందుకు వర్తింప జేయరని ప్రశ్నిస్తున్నారు. డ్రైవింగ్ టెస్టుల కోసం తాము విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు పెట్టి మరీ వస్తున్నామని అధికారుల తీరు వల్ల విలువైన సమయాన్ని నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు.

 In Chennai, women in jeans & capris barred from driving test

జీన్స్ ధరించి వచ్చే అమ్మాయిలకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించకూడదనే నిబంధన ఏదీ కొత్త వాహన చట్టంలో లేదని వీఎస్ సురేష్ అనే న్యాయవాది స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ.. అధికారులు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు అత్యుత్సాహం చూపుతున్నారని, అకారణంగా యువతులకు డ్రైవింగ్ టెస్ట్ లను నిర్వహించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కేకే నగర్ ఆర్టీఓ అధికారులు మాత్రం నిబంధనలను తాము పక్కాగా అమలు చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు. రవాణాశాఖ నుంచి సడలింపులు వచ్చేంత వరకూ తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామని బాహటంగా చెబుతున్నారు.

English summary
KK Nagar Regional Transport Office (RTO) in Chennai has denied entry to womans, who came for driving test wearing Jeans. Woman was left red-faced when a motor vehicle inspector refused to let her take the test because he found her dress inappropriate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X