వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ టెక్నాలజీపై ఏఐసీటీఈ తాజా నిర్ణయం: కాబోయే టెక్కీల్లో కొత్త జోష్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్(ఏఐసీడీఈ) తాజా నిర్ణయం యువ టెక్కీలకు ఖచ్చితంగా శుభవార్తే. పరిశ్రమ అవసరాలకు, సిలబస్‌కు మధ్య నెలకొన్న గ్యాప్‌ను తొలగించేందుకు ఏఐసీడీఈ చొరవ తీసుకుంటోంది.

ఇంజినీరింగ్ విద్యార్థులకు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచేందుకు ఆయా కరిక్యులమ్‌ను పాఠ్యాంశాల్లో జోడించాలని కళాశాలలకు సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ వంటి నూతన టెక్నాలజీలను సిలబస్‌లో పొందుపర్చేందుకు కసరత్తు జరుగుతోంది.

తాజా నిర్ణయంతో మేలే

తాజా నిర్ణయంతో మేలే

తాజాగా ఏఐసీటీఈ తీసుకున్న నిర్ణయంతో దేశంలోని 3000 ఇంజినీరింగ్, సాంకేతిక కళాశాలల్లో నూతన కరిక్యులమ్ అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ వంటి నూతన సాంకేతికతపై ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్లకు పట్టు ఉండేలా నూతన సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ, పంజాబ్ టెక్ యూనివర్సిటీ, వైఎంసీఏ ఫరీదాబాద్ సన్నాహాలు మొదలపెట్టాయి.

 ఎంతో ఆసక్తిగా..

ఎంతో ఆసక్తిగా..

అన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌పై పూర్తి స్థాయి సెమిస్టర్ ఉంటుందని, ఇతర ఇంజినీరింగ్ కాలేజీలు సైతం నూతన టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయని మానవ వనరుల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

 అందుబాటులో కొత్త నైపుణ్యం

అందుబాటులో కొత్త నైపుణ్యం

అంతేగాక, ఐఐటీలు, ఎన్ఐటీలు సహా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఇంజినీరింగ్ కాలేజీల నుంచి బయటకు వచ్చే నూతన గ్రాడ్యుయేట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌పై సమర్థవంతంగా పనిచేయ గల నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పారు.

 ఐటీ సంస్థల హర్షం

ఐటీ సంస్థల హర్షం

నూతన సాంకేతికతపై ఫ్యాకల్టీలకు శిక్షణ ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఈ కోర్టులను రూపొందిస్తోందని చెప్పారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు కొత్త టెక్నాలజీలపై అవగాహన కల్పించే కోర్సులు ప్రవేశపెడుతుండటం పట్ల ఐటీ సంస్థలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.

English summary
Artificial Intelligence has caught the attention of the government at the campuses. New technologies including AI, robotics, machine learning (ML), Internet of things (IoT) have been given up to 20 credits, as per the new curriculum prepared by the All India Council for Technical Education (AICTE) for the first time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X