వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా అనాల్సింది కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలపై గవర్నర్ వివరణ...

|
Google Oneindia TeluguNews

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాశ్మీర్‌ను లూటీ చేస్తున్న టెర్రరిస్టులను చంపండంటూ టెర్రిరిస్టులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో నాలుక్కరుచుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. అవినీతిపై ఆగ్రహంతోనే తానీ వ్యాఖ్యలు చేశానే తప్ప మరో ఉద్దేశం లేదని చెప్పారు.

కార్గిల్‌లోని ఖ్రీ సుల్తాన్ ఛూ స్టేడియంలో లడక్ టూరిజం ఫెస్టివల్ 2019ను గవర్నర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెర్రరిస్టులు అమాయక ప్రజలను కాకుండా కాశ్మీర్ లోయను లూటీ చేస్తున్న అవినీతి అధికారులను కాల్చి చంపాలని అన్నారు. రాష్ట్రంలో, ప్రభుత్వంపై టెర్రరిస్టులు చేస్తున్న పోరాటం వ్యర్థమన్న ఆయన.. హింసతో వారు తీసుకొచ్చే ఒత్తిడికి ప్రభుత్వం లొంగదని అన్నారు.

In Fit Of Anger J&K Governor clarifies on his comments

అవినీతి అధికారులను చంపాలంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గవర్నర్ నాలిక కరుచుకున్నారు. తన కామెంట్లపై వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. గవర్నర్ హోదాలో ఉన్న తాను అలాంటి కామెంట్లు చేసి ఉండాల్సింది కాదని చెప్పారు. కాశ్మీర్‌లో పెచ్చరిల్లుతున్న అవినీతిని చూసి తట్టుకోలేక కోపంతో అలాంటి వ్యాఖ్యలు చేశానని చెప్పారు. గవర్నర్‌గా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాన్నే వ్యక్తం చేశానని ఎస్పీ మాలిక్ స్పష్టం చేశారు.

English summary
After the backlash over his comments, Jammu kashmir governor Mr Malik clarified today that he had spoken in a fit of anger and frustration due to rampant corruption.As Governor, I should have not made such a comment, but my personal feeling is the same as I said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X