వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ , షాల స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ ... అన్ని స్థానాల్లోనూ ఆధిక్యం

|
Google Oneindia TeluguNews

రెండు దశాబ్దాలుగా బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాలు లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకుపోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు స్వరాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో గత ఎన్నికల ఫలితాలను 26 లోక్సభ స్థానాలకు 26 క్లీన్ స్వీప్ చేసిన బిజెపి ఈసారి కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 26 లోక్సభ స్థానాలను బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీ నగర్ నుండి ఎన్నికల బరిలోకి దిగారు అమిత్ షా 217 327 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ కు చెందిన సీజే చావ్డా పై పోటీలో ఉన్నారు. మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాల్లో 371 మంది పోటీలో ఉన్నారు.

ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో గుజరాత్ రాష్ట్రంలో బిజెపి 25 నుండి 26 స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొన్నాయి. ఇక దానికి తగినట్టుగా ప్రస్తుతం బిజెపి గుజరాత్ రాష్ట్రంలో దూసుకుపోతోంది.

నాలుగు దశాబ్దాల రికార్డు బ్రేక్..! సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టనున్న ప్రధానిగా మోడీ..నాలుగు దశాబ్దాల రికార్డు బ్రేక్..! సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టనున్న ప్రధానిగా మోడీ..

In Gujarat BJP Leads in All 26 Seats in Modi-Shahs Home Turf

2014 లోక్ సభ ఎన్నికల్లో 26 స్థానాలు సాధించిన బిజెపికి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 115 స్థానాలలో గెలుస్తుందని భావించగా కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకే బీజేపీ గెలుపును పరిమితం చేసింది. ఇక ఈ నేపధ్యంలో 2009 లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన ప్రభావం చూపిస్తుందా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది.

అయితే చాలా స్పష్టమైన మెజార్టీతో బీజేపీ గుజరాత్ ఎన్నికల్లో దూసుకుపోతుంది. 26 లోక్ సభ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది .

English summary
As per early trends, BJP is sweeping Gujarat at the moment, leading in all 26 Lok Sabha constituencies in the state. BJP chief Amit Shah is leading from Gandhinagar by a margin of 2,17,327 votes. He is up against Congress’ CJ Chavda. A total of 371 candidates contesting from 26 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X