వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: గుర్గావ్‌లో ‘జుట్టు దెయ్యం’! ముందు ఏడుపు, నల్లపిల్లి.. మహిళగా మారిపోయి...

ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళల శిరోజాలు కత్తిరిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల గుర్గావ్ లో మూడు ఘటనలు జరిగాయి. తాజాగా మళ్లీ గుర్గావ్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గుర్గావ్: ఓ గుర్తుతెలియని వ్యక్తి మహిళల శిరోజాలు కత్తిరిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల గుర్గావ్ లో మూడు ఘటనలు జరిగాయి. తాజాగా మళ్లీ గుర్గావ్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

బీహార్‌కి చెందిన సంత్ర(30) తన భర్తతో కలిసి గుర్గావ్ లో కొన్నేళ్లుగా ఇల్లు అద్దెకి తీసుకుని నివసిస్తోంది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో సంత్ర ఇంటి ముందు ఏడుపు శబ్ధాలు వినిపించాయట.

woman-hair-chopped

భయపడి ఆమె తలుపు తీయలేదు. అనంతరం ఓ నల్ల పిల్లి మహిళగా మారిపోయి జుట్టు కత్తిరించి మాయమైపోయిందని సంత్రా పోలీసులకు తెలిపిందట. సంత్రా కేకలు పెట్టడంతో ఏం జరిగిందోనని వచ్చి చూసేసరికి సంత్రాకు జట్టు లేకపోవడం చూసి కంగుతిన్నానని ఆమె భర్త ప్రకాశ్‌ తెలిపాడు.

ఆ సమయంలో సంత్రా తప్ప మరెవరూ నల్ల పిల్లిని చూసింది లేదని స్థానికులు చెప్పారు. అయితే ఈ విషయమై సంత్రా దంపతులు ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదని పోలీసులు పేర్కొన్నారు.

'ఓ పిల్లి మహిళగా మారిపోయిందని సంత్రా చెబుతోంది. కానీ నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు జరగడం అసంభవం. ఆమె జుట్టుని కత్తిరించిన వారెవరో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడతాం' అని పోలీసులు తెలిపారు.

English summary
Another woman from Gurgaon on Monday claimed that her hair was chopped under mysterious circumstances. The fourth such incident reported from Gurgaon over the past three day has fuelled superstition and rumour-mongering in the area. In Monday incident, a 30-year-old woman, Santra, from Bihar who lived in a rented house in Devi Lal Nagar Sector 9 shouted for help around 5.30 am after her braids were cut. She alleged that she heard some noise coming from near the main gate but when she did not open the gate, someone started crying. According to the police, Santra said she tried to ignore the noise but then she spotted a black cat which took the shape of a woman who was carrying scissors and cut her braids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X