వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిమాచల్ తీర్పు: ‘రాజ్ ఆఫ్ హిల్స్’కు సుఖ్‌రాం తనయుడి సవాల్

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాలని సీఎం వీరభద్రసింగ్ సంకల్పించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు మాత్రం వ్య

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాలని సీఎం వీరభద్రసింగ్ సంకల్పించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేకులు మాత్రం వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 'రాజ్ ఆఫ్ హిల్స్‌'గా పేరొందిన వీరభద్ర సింగ్.. 1952లో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ హయాం నుంచి ఇప్పటికీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేతగా పేరుంది. 83 ఏళ్ల వయస్సులోనూ సమరోత్సాహంతో దూసుకెళ్తున్నారు.
గతంలో సీఎంగా ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆధ్వర్యంలో అభియోగాలను ఎదుర్కొంటున్న సీఎం వీరభద్ర సింగ్ స్థానంలో క్లీన్ ఇమేజ్ గల యువ నాయకుడి ప్రతిష్ఠతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానిది. అంచనాలు, సంప్రదాయ బద్దంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో మళ్లీ సీఎం అభ్యర్థిగా వీరభద్ర సింగ్ అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసింది.

సుఖ్‌రాం తనయుడు అనిల్ శర్మ ఇలా బీజేపీలోకి..

సుఖ్‌రాం తనయుడు అనిల్ శర్మ ఇలా బీజేపీలోకి..

ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ గల నాయకుడు ఆయనొక్కరే కావడం గమనార్హం. సీఎం అభ్యర్థిగా వీరభద్రసింగ్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పశు సంవర్ధక శాఖ మంత్రి ప్లస్ కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ మాజీ మంత్రి సుఖ్ రాం తనయుడు అనిల్ శర్మ.. ప్రతిపక్ష బీజేపీలో చేరడం అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. వారం క్రితం వరకు మండీలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగసభలో సీఎం వీరభద్ర సింగ్‌తో కలిసి అనిల్ శర్మ వేదిక పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ‘జవాబ్ దేగా హిమాచల్' నినాదమిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. అదే రింగ్‌లో చిక్కుకున్నది.

1998లో ఇలా కక్ష తీర్చుకున్న సుఖ్‌రాం

1998లో ఇలా కక్ష తీర్చుకున్న సుఖ్‌రాం

మరణించిన కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రాంతో హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ రాష్ట్రంలో తొలి నుంచి పరస్పరం ఎత్తుపై ఎత్తులతో కూడిన రాజకీయాలు నడుపుతూ వచ్చారు. 1990 దశకం వరకూ కత్తులు దూస్తూ వచ్చారు. 1993లోనే సీఎం కావాలని కలలు గన్న సుఖ్ రాంను వీరభద్ర సింగ్ అడ్డుకున్నారు. దానికి ప్రతిగా వీరభద్రసింగ్‌పై హిమాచల్ కాంగ్రెస్ వికాస్ పార్టీ (హెచ్‌వీసీ) స్థాపించి సుఖ్‌రాం కక్ష సాధించుకున్నారు. అప్పుడు కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకున్నా బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ ధుమాల్‌తో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు.

గెలుపుకోసం కాంగ్రెస్ చమటోడ్చాల్సిందే

గెలుపుకోసం కాంగ్రెస్ చమటోడ్చాల్సిందే

తాజాగా ఇదే పరిస్థితి మరోసారి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరభద్రసింగ్‌పై కసి తీర్చుకునేందుకు సుఖ్ రాం తనయుడిగా అనిల్ శర్మ సిద్ధమయ్యారు. ఏది ఏమైనా అనిల్ శర్మ నిష్క్రమణ.. ఏడోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వీరభద్రుడిపై అవినీతికేసులతో ఆత్మరక్షణలో కాంగ్రెస్

వీరభద్రుడిపై అవినీతికేసులతో ఆత్మరక్షణలో కాంగ్రెస్

1990వ దశకం తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఐదేళ్లకోసారి చెరోసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు అంత బాగా ఏమీ లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. పరస్పరం ఒకరికి ఒకరు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత తోడైంది. సీఎం వీరభద్రసింగ్‌పై అవినీతి కేసులు, ఇటీవల టీనేజ్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసు ఆ పార్టీ పరిస్థితిని మరింత విషమం చేసేశాయి.

విమర్శలకు వెనుడాడని మోదీ ఇలా

విమర్శలకు వెనుడాడని మోదీ ఇలా

ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సీఎం వీరభద్ర సింగ్ నుంచి ప్రధాని మోదీ ‘హిమాచల్ టోపీ' అందుకున్నారు. కానీ కాంగ్రస్ పార్టీ నాయకుడిగా వీరభద్రసింగ్‌పై దాడి చేయడానికి మాత్రం ప్రధాని మోదీ వెనుకాడలేదు. సీబీఐ కేసులో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వీరభద్రసింగ్ సారథ్యంలోని ‘జమానత్ సర్కార్' బెయిల్‌పై నడుస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

జయ్ షాను ప్రశ్నించలేని పరిస్థితిలో కాంగ్రెస్

జయ్ షాను ప్రశ్నించలేని పరిస్థితిలో కాంగ్రెస్

ఈ పరిస్థితుల్లో వీరభద్రసింగ్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. సీఎం వీరభద్రసింగ్‌పై రూ.5.6 కోట్ల అక్రమాస్తుల కేసు కొనసాగుతుండగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జయ్‌షా కంపెనీ అసాధారణ టర్నోవర్ పెరుగుదలపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పరిమితులు ఏర్పాటయ్యాయి.

ప్రచార వనరులు కాంగ్రెస్ పార్టీకి పరిమితం

ప్రచార వనరులు కాంగ్రెస్ పార్టీకి పరిమితం

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఎన్నికల ప్రచారానికి ఆటంకంగా మారాయి. సీఎం వీరభద్రసింగ్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సుఖు మధ్య విభేదాల కారణంగా ఇప్పటికీ వారిద్దరూ ఎన్నికల ప్రచారంలో వేదిక పంచుకోకపోవడం గమనార్హం. బీజేపీ హై ప్రొఫైల్ ప్రచారం, బూత్ లెవెల్ మేనేజ్మెంట్‌తో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉన్న వనరులు పరిమితం.

అధికారం కోసం నడ్డా వర్సెస్ ధుమాల్

అధికారం కోసం నడ్డా వర్సెస్ ధుమాల్

కానీ బీజేపీ కూడా సమస్యలకు దూరంగా లేదు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా ప్రముఖ నాయకుడు ప్రేమ్ సింగ్ ధుమాల్, యువ నాయకుడు - కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య చీలిపోయింది. ధుమాల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మద్దతు ఉన్నది. ప్రత్యేకించి హమీర్‌పూర్, ఉనా, మండీ, బిలాస్‌పూర్, కంగ్రా, సిమ్లా జిల్లాల పరిధిలో ఆయనకు ప్రజాదరణకు కొదవలేదు. మరోవైపు పార్టీ హై కమాండ్ వద్ద పలుకుబడి గల కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర రాజకీయాల్లో చేరిపోయి సీఎంగా తదుపరి ప్రభుత్వానికి సారథ్యం వహించాలని తలపోస్తున్నారు. అందుకు అనుగుణంగా తరుచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ బీజేపీ శ్రేణులను ఉత్సాహ పరుస్తూ పలు నూతన ప్రాజెక్టులు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు.

గుజరాత్‌లో ప్రధాని మోదీకి గడ్డు పరిస్థితి ఇలా

గుజరాత్‌లో ప్రధాని మోదీకి గడ్డు పరిస్థితి ఇలా

ఈ నేపథ్యంలోనే హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా బీజేపీ నాయకత్వం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా దాటేసింది. ఒకవేళ ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటే.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ప్రభావం ఉండబోదని సీఎం వీరభద్రసింగ్ చెప్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో బ్యాంకింగ్ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని సిమ్లా, మండి, కుల్లు, నహన్, ఉనా, కంగా, బిలాస్‌పూర్ జిల్లాల్లో జీఎస్టీ అమలు తీరును వ్యాపారులు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎదురు దాడి

నోట్ల రద్దు, జీఎస్టీ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎదురు దాడి

గత ఐదేళ్లుగా వీరభద్ర సింగ్ ప్రభుత్వం పనితీరు కూడా అంత బాగా ఏమీ లేదు. ఆయన ప్రభుత్వం అంతా ‘రిటైర్డ్, టైర్డ్, హైర్డ్' అధికారులకు నిలయం అని విమర్శలు ఉన్నాయి. వీరభద్రసింగ్ ప్రభుత్వం ‘మాఫియా రాజ్' నడుపుతోంది. వీరభద్రసింగ్ సర్కార్ అటవీ, డ్రగ్, లాండ్, లిక్కర్, టింబర్, ట్రాన్స్‌ఫర్ మాఫియా'కు నిలయమని బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ ఆరోపణ. బీజేపీ నుంచి చేసే ఆరోపణలను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ అభివ్రుద్ధి అంశాన్ని ప్రస్తావిస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి జాతీయ అంశాలను ప్రచారంలోకి తేవడానికి వీరభద్ర సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నామని, ధరల పెరిగాయని, రాష్ట్రానికి కేంద్రం నిధులు తగ్గాయని హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ ఆరోపిస్తున్నది.

విక్రమాదిత్యకు పట్టాభిషేకం ఇలా

విక్రమాదిత్యకు పట్టాభిషేకం ఇలా

అయితే బీజేపీ ‘హిసాబ్ మాంగే హిమాచల్' అసెంబ్లీ ఎన్నికల ప్రచార నినాదం ముందు కాంగ్రెస్ పార్టీ ‘జవాబ్ దేగా హిమాచల్' నినాదం డిఫెన్సివ్‌గా ఉంది. కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి సీఎం వీరభద్రసింగ్ చాలా కఠోర శ్రమకు పాల్పడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో వీరభద్ర సింగ్ తన తనయుడు, హిమాచల్ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా విక్రమాదిత్య సింగ్‌కు కాంగ్రెస్ పార్టీలో చోటు కల్పించేందుకు.. ఎంతో కాలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిమ్లా రూరల్ స్థానం నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేయడం హైలెట్.

కాంగ్రెస్ పార్టీదీ అతి విశ్వాసం అన్న బీజేపీ

కాంగ్రెస్ పార్టీదీ అతి విశ్వాసం అన్న బీజేపీ

అయితే 68 స్థానాలకు 59 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించినా సిమ్లా రూరల్ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష బీజేపీ అధి నాయకత్వాలు మాత్రం తమ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీశాయన్న విమర్శలు ఉన్నాయి. సీఎం అభ్యర్థిని ప్రకటించకూడదని ప్రకటించిన బీజేపీ నాయకత్వం.. ఈ విషయమై మౌనం వహిస్తున్నది. సీఎంగా వీరభద్ర‌సింగ్‌ను మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అతి విశ్వాసం అని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

English summary
While sections of the Congress party are voting with their feet against 83-year-old Virbhadra Singh’s nomination, the BJP camp is divided between veteran Prem Singh Dhumal and the much younger Union health minister J P Nadda. He is known as the ‘Raja” of the hills, a politician who wears velvet gloves but doesn’t like to give up battle and is well-known for springing surprises and political upsets in a career that began when Jawaharlal Nehru was still alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X