వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయిదేళ్లలో మొట్ట‌మొద‌టి ప్రెస్‌మీట్‌..స‌మాధానాల‌ను అమిత్ షాపైకి తోసిన మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014 మేలో ప్ర‌ధాన‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన త‌రువాత ఇప్ప‌టిదాకా ఒక్క విలేక‌రుల స‌మావేశాన్ని పిల‌వ‌లేదు న‌రేంద్ర మోడీ. దీనిపై రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు కాస్త గ‌ట్టిగానే విమ‌ర్శించారు. అలాంటిది- తుది ద‌శ ఎన్నిక‌ల‌కు ముందు భార‌తీయ జ‌న‌తాపార్టీ జాతీయ అధ్య‌క్షుడు నరేంద్ర మోడీతో క‌లిసి మోడీ విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారంటూ స‌మాచారం అంద‌గానే- అల‌ర్ట్ అయ్యారు రిపోర్ట‌ర్లు. అర‌గంట ముందే- బీజేపీ కేంద్ర కార్యాల‌యానికి చేరుకున్నారు. అస‌లే అయిదేళ్ల‌లో మొట్ట‌మొద‌టి ప్రెస్ మీట్‌. ఎలాంటి ప్ర‌శ్న‌లు వేయాలి? ఎలాంటి స‌మాధానాల‌ను రాబ‌ట్టాలంటూ ముందే రెడీ అయిపోయారు. దీనికి అనుగుణంగా- ప్రెస్‌మీట్‌లో ప్ర‌శ్న‌లు అడ‌గ‌ద‌లిచిన విలేక‌రుల పేర్ల‌ను ముందే అంద‌జేయాలంటూ కార్యాల‌యం సిబ్బంది సూచించ‌డంతో.. దాదాపు అంద‌రూ త‌మ పేర్ల‌ను రాసి ఇచ్చేశారు.

షెడ్యూల్ కంటే అర‌గంట ఆల‌స్యంగా ఆరంభ‌మైంది విలేక‌రుల స‌మావేశం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. న‌రేంద్ర మోడీ ఆల‌స్యంగా చేరుకోవ‌డం. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శుక్ర‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టించారాయ‌న‌. అక్క‌డి నుంచి నేరుగా న్యూఢిల్లీకి చేరుకున్నారు. అమిత్ షాతో క‌లిసి ప్రెస్ కాన్ఫ‌రెన్స్ హాలుకు వ‌చ్చారు. ప్రెస్‌మీట్‌ను అమిత్‌షా మొదలు పెట్టారు. చాలా విష‌యాల‌పై క్లుప్తంగా మాట్లాడారు. అనంత‌రం మైక్‌ను మోడీ ముందు ఉంచారు. చిరున‌వ్వుతో ఆరంభించారు మోడీ.

In his first-ever press conference, PM Modi directs all questions to Amit Shah

ప్ర‌ధాని కాక‌ముందు మీతో క‌లిసి చాయ్ తాగేవాన్ని: మోడీ
ప్ర‌ధాని ప‌ద‌విని అందుకోక‌ముందు- రోజూ పార్టీ కార్యాల‌యంలో సాయంత్రం 5 గంట‌ల‌కు విలేక‌రుల‌తో చాయ్ తాగేవాడిన‌ని, ఇప్పుడా అవ‌కాశం లేద‌ని అన్నారు. అయిదేళ్ల కింద‌ట తాను చూసిన కొంత‌మంది సీనియ‌ర్ విలేక‌రులు.. ఇప్పుడూ క‌నిపిస్తున్నార‌ని న‌వ్వుతూ చెప్పారు. అనంత‌రం నేరుగా స‌బ్జెక్ట్‌లోకి దిగి పోయారు. చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌, పోలింగ్ స‌ర‌ళి మీదే ఆయ‌న దృష్టి పెట్టారు. విప‌క్షాల‌పై పెద్ద‌గా విమ‌ర్శ‌ల‌ను సంధించ‌లేదు గానీ, మ‌ధ్య‌మ‌ధ్య‌లో చుర‌క‌లు అంటిస్తూ కాస్త ఉల్లాసంగా క‌నిపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి వెళ్లిన తొలిరోజు ఎలా ఉన్నానో.. చివ‌రి రోజు కూడా అలాగే ఉన్నాన‌ని ఆయ‌నే చెప్పుకొన్నారు. అనంత‌రం- విలేక‌రులు ప్ర‌శ్న‌లు వేయ‌డానికి సిద్ధ‌పడ‌గా.. మైక్‌ను అమిత్ షా ముందుకు తోశారు. త‌న‌ను ఏమీ అడ‌గొద్ద‌ని ఆయ‌న చెప్ప‌కనే చెప్పిన‌ట్ట‌యింది.

ప్ర‌ధాని స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది?
ఒక‌రిద్ద‌రు విలేక‌రులు.. తాము మోడీని ప్ర‌శ్నిస్తున్నామ‌ని సంబోధిస్తూ- ప్ర‌శ్న‌లు వేసిన‌ప్ప‌టికీ త‌ప్పించుకున్నారాయ‌న‌. వాటి స‌మాధానాల‌ను కూడా అమిత్ షా ఇచ్చారు. ఆ మాత్రం ప్ర‌శ్న‌ల‌కు మోడీ స‌మాధానం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముందీ? అంటూ రాగాలు తీశారు అమిత్ షా. 23వ తేదీన కాంగ్రెస్ పార్టీ బీజేపీయేత‌ర పార్టీల‌తో స‌మావేశాన్ని ఏర్పాటు చేశార‌ని, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వంటి త‌ట‌స్థులు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయంటూ ఓ విలేక‌రి ప్ర‌శ్నించ‌గా.. తాము సొంతంగా 300 సీట్లకు పైగా మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఈ ప‌రిస్థితులు అలాంటి ప్ర‌శ్న అస‌లు ఉత్ప‌న్న‌మే కాద‌ని అమిత్ షా చెప్పారు. ఇలా చాలా ప్ర‌శ్న‌ల‌ను దాట వేశారు. అమిత్ షా చెబుతున్న స‌మాధానాల‌ను శ్ర‌ద్ధ‌గా వింటూ క‌నిపించారు మోడీ. ప‌శ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన హింసాత్మక ప‌రిస్థితులు, దేశ భ‌ద్ర‌త వంటి అంశాల‌పై విలేక‌రులు ప్ర‌శ్న‌లు వేసిన‌ప్ప‌టికీ.. దాన్ని మోడీ స్వీక‌రించ‌లేదు. అమిత్ షానే స‌మాధానాలు ఇచ్చారు. మోడీ నుంచి స‌మాధానాల‌ను రాబ‌ట్టడానికి విలేకరులు చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌లం అయ్యాయి. దీనితో ఉస్సూరుమంటూ వెనుదిగారు.

English summary
Prime Minister Narendra Modi addressed his first press conference today but avoided answering any question. All questions asked during the press conference were instead answered by Bharatiya Janata Party (BJP) president Amit Shah, who was seated next to him. The press conference was organised at the BJP headquarters in New Delhi. When the media asked questions to the prime minister, Amit Shah said he need not answer them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X