వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kalam vision 2020: అన్నమో రామచంద్ర, ఆకలితో అలమటిస్తోన్న పేదలు, పోషకాహార లోపంతో చిన్నారులు

|
Google Oneindia TeluguNews

ఎన్నో ఆశలు, ఆశయాలతో 2000వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎప్పటిలానే నూతన సంవత్సరం వచ్చింది కానీ.. మనం శతాబ్దంలోకి అడుగిడం. దీనిని మిలినియమ్ సంవత్సరం అని పిలుస్తున్నాం. 2000వ సంవత్సరంలో 2020కి దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదానిపై ఆలోచించాం. ఓ వైపు టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతుండగా.. మరోవైపు శాస్త్రసాంకేతిక రంగం వైపు పరుగులు తీస్తోంది. మిగతా దేశాలతో అన్ని రంగాల్లో భారతదేశం పోటీ పడుతోంది. కానీ విజన్ 2020ని మాత్రం ఆవిష్కరిచింది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామే.

 మనం ఎక్కడ..?

మనం ఎక్కడ..?

విజన్ 2020 ఆవిష్కరించి 20 ఏళ్లు పూర్తయిపోయాయి. ఆయా రంగాల్లో దేశ ప్రగతి ఎలా ఉందో ఒక్కసారి ఆత్మవలోకనం చేద్దాం. ఇప్పటికే సాధించాల్సిన లక్ష్యాలు పూర్తిచేశామా..? లేదంటే లక్ష్యానికి కొద్దిదూరంలో నిలిచిపోయామా..? ఆయా రంగాల్లో మన లక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయా ? సాధించాల్సిన అభివృద్ధి ఏమీ ఉంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆకలి, పోషకాహార లోపం గురించిన వివరాలను పరిశీలిద్దాం.

 అన్నమో రామచంద్రా..

అన్నమో రామచంద్రా..

1992లో దేశంలో 240 మంది మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడేవారు. 2012 నాటికి ఆ సంఖ్య 217కి చేరింది. 9 శాతం పోషకాహార లోపం తగ్గినా.. మిగతా దేశాలతో పోల్చితే సరైన ఆహారం లభించడం లేదనే అంశం ఆందోళన కలిగిస్తోంది. ఆహార మరియ వ్యవసాయ సంస్థ సర్వేలో కఠోన నిజాలు వెలుగుచూశాయి. అందరికీ ఆహారం, పోషకాహార లోపం ఉండకూడదనే ప్రభుత్వ విధానం దారుణంగా విఫలమైంది. అంతేకాదు ప్రపంచ ఆకలి పట్టికలో భారతదేశం మొదటిస్థానంలో నిలువడం మన దేశ పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రతీరోజు 200 మిలియన్ల ప్రజలు ఆకలితో పస్తులుంటారనే కఠోర వాస్తవం సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు

పోషకాహార లోపం

పోషకాహార లోపం

2016 నాటికి 5 ఐదేళ్ల వయస్సు ఉన్న 38 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారు సరైన ఎత్తు పెరగడం లేదు. ఇది పట్టణాల్లో 31 శాతం ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 21 శాతం భారతీయ చిన్నారులు కుంగదీసే (వేస్టింగ్) వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో డిజిబౌటి, శ్రీలంక, దక్షిణ సుడాన్‌లో 20 శాతం మంది చిన్నారులు బాధపడుతున్నారు. ఆ దేశాల తర్వాత భారత్ నిలిచిందనే అంశం ఆందోళన కలిగిస్తోంది.

పాకిస్తాన్ తర్వాతే..

పాకిస్తాన్ తర్వాతే..

ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలపై గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) సర్వే చేపడుతోంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సంస్థ 117 దేశాల్లో సర్వే చేపట్టగా.. భారతదేశం 102వ స్థానంలో నిలిచింది. దేశంలో పోషకాహారం, ఆకలి అంశాలకు సంబంధించి 30.3 మార్కులు మాత్రమే వచ్చాయి. భారత్ ఆకలితో అలమటిస్తోన్న దేశమని సర్వేతో తేలిపోయింది. మన పొరుగు దేశాలు, అభివృద్ధిలో పోటీ పడలేని బంగ్లాదేశ్ 88, పాకిస్థాన్ 94, శ్రీలంకం 66, నేపాల్ 73 మెరుగైన స్థానాలు సాధించాయి. ఎప్పుడూ ఉగ్ర దాడులు, అస్థిరత్వంతో ఉండే ఆఫ్ఘనిస్థాన్ మాత్రం 108వ ర్యాంకుతో మన తర్వాత స్థానంలో ఉంది.

అట్టడుగున...

అట్టడుగున...

ఆకలి, పోషకాహార లోపం విషయంలో భారత్ మిగతా దేశాలతో చాలా వెనకబడి ఉంది. వివిధ సర్వే సంస్థల నివేదికల ఆధారంగా కఠోర వాస్తవాలు వెలుగుచేస్తున్నాయి. 125 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తోంది. పోషకాహారం లేక చిన్నారుల బంగారు భవిత ప్రశ్నార్థకంగా మారుతుంది.

English summary
Food and Agriculture Organization, in 1992, there were 240 million undernourished people in India. In 2012, the figure has gone down to 217 million, a decline of more than 9%.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X