వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముదురుతోంది: భారత్‌కు పోస్టల్ సర్వీసులను రద్దు చేసిన పాక్

|
Google Oneindia TeluguNews

జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పాకిస్తాన్‌ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భారత్‌పై అన్ని విధాలు విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతూ వస్తోంది. భారత్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఇప్పటికే బస్సు, రైలు సర్వీసులను రద్దు చేయడమే కాకుండా భారత విమానాలకు తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి సైతం నిరాకరించింది. అంతేకాదు భారత్‌తో వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది. ఇదే కుట్రలకు కొనసాగింపుగా తాజగా భారత్‌కు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

కొనసాగుతున్న పాక్ కుట్రలు: ఎల్ఓసీ వద్ద చొరబాట్లకు సహకారం: పసిగట్టిన నిఘా వర్గాలు..!కొనసాగుతున్న పాక్ కుట్రలు: ఎల్ఓసీ వద్ద చొరబాట్లకు సహకారం: పసిగట్టిన నిఘా వర్గాలు..!

పోస్టల్ సేవలను నిలిపివేసిన పాకిస్తాన్

పోస్టల్ సేవలను నిలిపివేసిన పాకిస్తాన్

పాకిస్తాన్ మరోమారు కుటిల బుద్ధిని చాటింది. భారత్‌కు తపాలా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్‌లో ప్రచురితమయ్యే మ్యాగజీన్లు ఇతర పబ్లికేషన్లు భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి పోస్టు ద్వారా పంపించేది. అయితే ఇప్పుడు వాటికి బ్రేక్ వేసింది. ఇదే విషయాన్ని భారత పోస్టల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరలో అజయ్ కుమార్ రాయ్ ధృవీకరించారు. ఆగష్టు 23న భారత్‌కు అన్ని పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం రాతపూర్వకమైన ప్రకటన ద్వారా తెలిపిందంటూ ఆయన చెప్పారు. అంతేకాదు భారత్ నుంచి పాకిస్తాన్‌కు ఉత్తరాలు చేరవేయడం కానీ, లేదా పాకిస్తాన్ నుంచి లెటర్స్ పంపడం కానీ ఇకపై జరగవని ప్రకటనలో తెలిపినట్లు రాయ్ చెప్పారు.

పాక్ ఏకపక్ష నిర్ణయం

పాక్ ఏకపక్ష నిర్ణయం

పాకిస్తాన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అజయ్ రాయ్ మండిపడ్డారు. ఇప్పటివరకు పాకిస్తాన్‌కు పోస్టల్ ద్వారా ఏమైనా పంపాలంటే సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌ ద్వారా పంపేవారమని అజయ్ రాయ్ వివరించారు. పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనంతవరకు సాధారణంగానే భారత్ నుంచి పాకిస్తాన్‌కు పార్శిల్స్ ఇతరత్ర లేఖలు పంపేవారమని అజయ్ రాయ్ చెప్పారు. పోస్టల్ సేవలు నిలిపివేయాలన్నది పాక్ సొంత నిర్ణయమని దానికి భారత్‌తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

లాహోర్ నుంచి విడుదలవుతున్న మ్యాగజైన్

లాహోర్ నుంచి విడుదలవుతున్న మ్యాగజైన్

పాకిస్తాన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రెండు దేశాల మధ్య సాంస్కృతిక మరియు సాహిత్యం పరంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణికి బ్రేక్ పడింది. ముఖ్యంగా ప్రతి నాలుగు నెలలకోసారి " పంజాబ్ దే రంగ్" అనే మ్యాగజైన్ పంజాబ్‌కు చెందిన గుర్ముఖి లిపిలో ప్రచురితం అవుతుంది. ఈ మాసపత్రిక లాహోర్‌ నుంచి వెలువడుతుంది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రజలు ఈ మ్యాగజీన్‌ను బాగా చదువుతారు. భారత్‌లో గుర్ముఖి లిపిలో పబ్లిష్ అయ్యే మ్యాగజీన్లు కానీ పత్రికలు కానీ చాలా అరుదు. అలా గుర్ముఖీ లిపిలో ప్రచురితం అవుతుంది పంజాబ్ దే రంగ్ మ్యాగజీన్ . ఇది పాకిస్తాన్‌లో ప్రచురితం అవుతుంది.

 మా ప్రచురణలను నిలిపివేసిన పాక్ పోస్టల్ శాఖ

మా ప్రచురణలను నిలిపివేసిన పాక్ పోస్టల్ శాఖ

ఈ మధ్యే భారత్‌లోని పంజాబ్‌కు పంజాబ్ దే రంగ్ మాసపత్రికకు సంబంధించి 70 కాపీలను భారత్‌కు పంపగా అవి తిరిగి తమ వద్దకు చేరుకున్నాయని పంజాబ్ దే రంగ్ మ్యాగజీన్ చీఫ్ ఎడిటర్ ఇషాన్ హెచ్ నదీమ్ తెలిపారు. పాకిస్తాన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ కాపీలను తిరిగి తమకు పంపిందని చెప్పారు ఇషార్ నదీమ్. 2010 నుంచి తాము ఈ మ్యాగజీన్‌లను భారత్‌కు పంపుతున్నామని అయితే ఈ మధ్యే భారత్‌కు పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు పాక్ పోస్టల్ శాఖ వెల్లడించిందని నదీమ్ చెప్పారు. సిక్కుల మతగురువు గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పాక్ ఇలా పోస్టల్ సేవలను నిలిపివేయడం దురదృష్టకరమన్నారు నదీమ్.

English summary
After the abrogation of article 370 in Jammu Kashmir, Pakistan in its lates move stopped the postal services to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X