వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చూడమ్మ‘చిన్నమ్మ’పోటి చేస్తే సినిమా చాపిస్తామమ్మ, జాగ్రత్త !

జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ప్రజలు శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్నమ్మ ‘శశికళ’ అతిగా ఆశలు పెట్టుకుని పెద్దగా ఊహించుకుంటే మీకే మంచిదికాదని హెచ్చరిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ప్రజలు శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. గ్రూపులు గ్రూపులుగా వెళ్లి పోయెస్ గార్డెన్ దగ్గర, అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.

<strong>శశికళ మీద పోటీ చేస్తా: జయలలిత మేనకోడలు దీపా చాలెంజ్</strong>శశికళ మీద పోటీ చేస్తా: జయలలిత మేనకోడలు దీపా చాలెంజ్

చిన్నమ్మ 'శశికళ' అతిగా ఆశలు పెట్టుకుని పెద్దగా ఊహించుకుంటే మీకే మంచిదికాదని హెచ్చరిస్తున్నారు. మా నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యద్దు, అక్కడికి వచ్చి ఓట్లు అడగొద్దు, మేము పార్టీలో ఉన్నామంటే అది కేవలం అమ్మ జయలలిత మీద ఉన్న అభిమానమే.

<strong>శశికళకు ఎదురు దెబ్బ: మీరు సీఎం కాలేరు, ఎమ్మెల్యే రాజీనామా!</strong>శశికళకు ఎదురు దెబ్బ: మీరు సీఎం కాలేరు, ఎమ్మెల్యే రాజీనామా!

అంతే కాని మిమ్మల్ని ఇక్కడి నుంచి పోటీ చేయించి గెలిపించడానికి కాదు. ఆర్ కే నగర్ కేవలం జయలలితకే పరిమితం. జయలలిత వారసురాలిగా ఇక్కడి నుంచి పోటీ చెయ్యాలని చూస్తే మీకే మంచిదికాదు. మీ పరువు పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు.

<strong>ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్!</strong>ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్!

ఆర్ కే నగర్ అంటే జయలలితకు

ఆర్ కే నగర్ అంటే జయలలితకు

ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి జయలలిత రెండు సార్లు పోటీ చేసి సీఎం అయ్యారు. ఆర్ కే నగర్ ప్రజలకు జయలలిత అంటే ప్రాణం. మాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే అన్నిపనులు పూర్తి చేసి పెట్టే జయలలిత మరణించడంతో అమ్మలేని విషయాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆశలు పెట్టుకున్న చిన్నమ్మ

ఆశలు పెట్టుకున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన శశికళ ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలనుకుంటున్నారు. అయితే అక్కడి ప్రజల నుంచి శశికళకు వ్యతిరేకత ఎదురైయ్యింది. అక్కడి ప్రజలు అందరూ ఇది జయలలిత నియోజక వర్గం, మీకు ఇక్కడ స్థానం లేదు అని తెగేసి చెబుతున్నారు.

75 రోజులు ఏం చేశారు

75 రోజులు ఏం చేశారు

జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే మాకు ఒక్క సారైనా అమ్మను చూపించారా ? అని ప్రశ్నిస్తున్నారు. జయలలిత మేనకోడలు దీపా ఇక్కడి నుంచి పోటీ చెయ్యాలి, ఆమెనే మేము గెలిపిస్తాం అని గట్టిగా చెబుతున్నారు.

మీరు కాదు దీపానే అమ్మ వారసురాలు

మీరు కాదు దీపానే అమ్మ వారసురాలు

జయలలిత నిజమైన వారసురాలు దీపానే అంటున్నారు. దీపానే అమ్మ వారసత్వం కొనసాగించాలని ఆర్ కే నగర్ ప్రజలు కచ్చితంగా చెప్పారు. ఆర్ కే నగర్ ప్రజలు ఒక్క సారిగా ఎదురు తిరగడంతో శశికళ వర్గీయులు షాక్ కు గురైనారు. శశికళ వర్గీయులు ఆర్ కే నగర్ ప్రజలకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు.

సీన్ రివర్స్.... మధురై నుంచి పోటీ ?

సీన్ రివర్స్.... మధురై నుంచి పోటీ ?

మధురై నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని శశికళకు ఆమె వర్గీయులు చెబుతున్నారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి సీఎం కావాలని ఆశలు పెట్టుకున్న శశికళకు స్థానిక ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు.

English summary
She was Jayalalithaa's closest aide, but many in the former Tamil Nadu chief minister's RK Nagar constituency in Chennai do not want AIADMK's new party chief Sasikala Natarajan to contest from there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X