వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఎన్నికలు: ధనిక అభ్యర్థి ఆస్తి రూ.1020 కోట్ల, పేద అభ్యర్థి ఆస్తి రూ.1000

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 883 మంది కోటీశ్వరులు బరిలో నిలిచారు. మొత్తం 2560 మంది పోటీ చేస్తున్నారు.

బీజేపీ నుంచి 224 మంది పోటీ చేస్తుండగా 208 (93%) మంది, 220 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 207 (94%) మంది, 199 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 154 (77%), 25 మంది జేడీయూ అభ్యర్థుల్లో 13(52%) మంది, 27 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 9 (33%) మంది, మిగతా వారిలో 1090 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 199 (18%) మంది కోటీశ్వరులు.

In Karnataka, the richest candidate is worth Rs 1,020 crore, poorest, Rs 1,000

అత్యధికంగా ఆస్తులున్నవారిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థులే. గోవిందరాజనగర్ నుంచి పోటీ చేస్తున్న ప్రియాకృష్ణ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. అతని ఆస్తి రూ.10,20,53,87,250. అందరికంటే తక్కువగా ఆస్తి ఉన్న అభ్యర్థి బొమ్మనహళ్లి నుంచి పోటీ చేస్తున్న దిలీప్ కుమార్. ఇతనికి స్థిరస్తులు ఏమీ లేవు. చరాస్తులు రూ.1000. ఇతని మొత్తం ఆస్తి రూ.1000.

తనకూ యడ్యూరప్పకు మధ్య ఉన్న పోటీని తనకూ ప్రధాని మోడీకి మధ్య పోటీగా మార్చారని సీఎం సిద్ధారామయ్య అన్నారు. కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. హంగ్‌ వచ్చే సమస్యే లేదన్నారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదా కట్టబెట్టే అంశం ప్రస్తుతం కర్ణాటక పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిందన్నారు.

English summary
The big focus in the report put up by the Association for Democratic Reforms was the 883 crorepati candidates who will be fighting the Karnataka assembly elections. The report analysed the affidavits of 2,560 candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X