వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కోడనాడు బంగ్లాలో హత్య: జిజిన్ చిక్కాడు, నోరు విప్పితే అసలు కథ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కోడనాడు టీ ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసి బంగ్లాలో లూటీ చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన జిజిన్ అలియాస్ కుట్టీని ఎట్టకేలకు నీలగిరి జ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కోడనాడు టీ ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసి బంగ్లాలో లూటీ చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన వ్యక్తి ఎట్టకేలకు నీలగిరి జిల్లాలోని కోటగిరి పోలీసులకు చిక్కాడు.

ఢిల్లీలో పన్నీర్ వర్గం దూకుడు: పిచ్చి చేష్టలతో శశికళ వర్గానికి అడుగు పెట్టాలంటే హడల్ !ఢిల్లీలో పన్నీర్ వర్గం దూకుడు: పిచ్చి చేష్టలతో శశికళ వర్గానికి అడుగు పెట్టాలంటే హడల్ !

హత్య చేసి ఇన్ని రోజులు తప్పించుకుని తిరుగుతున్నజిజిన్ అలియాస్ కుట్టీని సోమవారం కేరళలో అరెస్టు చేసి తమిళనాడుకు తీసుకు వచ్చారు. కోడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసులో ఇప్పటికే జయలలిత మాజీ కారు డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

కేరళ పోలీసులు

కేరళ పోలీసులు

ఈ కేసులో అరెస్టు అయిన మరో నిందితుడు సయాన్ కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 18వ తేదీన కేరళ పోలీసులు కోయంబత్తూరు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సయాన్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు.

జయలలిత, శశికళ గదుల్లో ?

జయలలిత, శశికళ గదుల్లో ?

జయలలితకు చెందిన కోడనాడు టీ ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితులు బంగ్లాలోని జయలలిత, శశికళ గదులు పగలగొట్టి విలువైన వస్తువులు చోరీ చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రధాన నిందితుడైన జయలలిత కారు డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో పోలీసులు తలపట్టుకున్నారు.

భార్య, కుమార్తె మరణించడంతో !

భార్య, కుమార్తె మరణించడంతో !

కోడు నాడు ఎస్టేట్ హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు సయాన్ కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో సయాన్ భార్య, కుమార్తె సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందడంతో సయాన్ డిప్రెషన్ లో ఉన్నాడు.

 చివరికి జిజిన్ చిక్కాడు

చివరికి జిజిన్ చిక్కాడు

మూడో నిందితుడు జిజిన్ మాత్రం ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని నీలగిరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మూడో ప్రధాన నిందితుడు జిజిన్ చిక్కడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

జిజిన్ నోరు విప్పితే అంతే !

జిజిన్ నోరు విప్పితే అంతే !

జిజిన్ ను విచారించి పూర్తి వివరాలు సేకరించి కోడనాడు టీ ఎస్టేట్ హత్య, లూటీ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి తీసుకురావాలని నీలగిరి జిల్లా పోలీసులు నిర్ణయించారు. కోయంబత్తూరు సమీపంలోని రహస్య ప్రాంతంలో జిజిన్ ను విచారిస్తున్నారని తెలిసింది. జిజిన్ నోరు విప్పితే ఈకేసులో ప్రధాన నిందితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

English summary
In Kodanadu bunglow murder case important accused jijin alias Kutty arrested in kerala by Kothagiri police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X