వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 నెలల్లో 921 ఎన్ కౌంటర్లు, 33 మంది: యోగీ ఆధిత్యనాథ్ ప్రభుత్వానికి నోటీసులు!

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ లో యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 10 నెలల కావస్తోంది. రౌడీషీటర్లు, గూండాలు వెంటనే లోంగిపోవాలని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో అసలు నేరాలు జరకుండా చూడాలని ప్రయతిస్తున్న పోలీసులు ఇప్పటి వరకూ 921 ఎన్ కౌంటర్లు చేశారు. 33 మంది రౌడీలు అంతం అయ్యారు.

పోలీసులకు ఫుల్ పవర్స్

పోలీసులకు ఫుల్ పవర్స్

రౌడీషీటర్లు, గుండాల మీద చర్యలు తీసుకోవడానికి యోగీ ఆధిత్యనాథ్ ప్రభుత్వం పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం మంగళవారం చెన్ను సర్కార్ అనే రౌడీషీటర్ ను లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయితే చెన్ను సర్కార్ పోలీసుల మీద ఎదురుదాడిగి దిగాడు.

33 మంది రౌడీలు

33 మంది రౌడీలు

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇక లాభం లేదని భావించి ఎన్ కౌంటర్ లో రౌడీషీటర్ చెన్ను సర్కార్ ను అంతం చేశారు. యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్ లో 921 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇప్పటి వరకూ కరుడుగట్టిన 33 మంది రౌడీలు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు.

ముగ్గురు పోలీసులు బలి

ముగ్గురు పోలీసులు బలి

ఎన్ కౌంటర్ సందర్బంలో రౌడీషీటర్లు ఎదురుదాడికి దిగడంతో ముగ్గురు పోలీసులు మరణించారు. అయినా పోలీసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉత్తరప్రదేశ్ లో రౌడీలు ఉండకూడదని, ఉంటే జైల్లోనే ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు.

రౌడీలకు సింహస్వప్నం

రౌడీలకు సింహస్వప్నం

గత కొన్ని ఏళ్లలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన అరాచకాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. రౌడీషీటర్ల పాలిట యోగీ అధిత్యనాథ్ సింహస్వప్నం అయ్యారు. మహిళల మీద అత్యాచారం చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వానికి నోటీసులు

ప్రభుత్వానికి నోటీసులు

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్లపై సీరియస్ అయిన జాతీయ మానవహక్కుల సంఘం 2017 నవంబర్ 22వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని సూచించింది. తమకు ఇంకా నోటీసులు అందలేదని, ఒక వేళ అందినా సమాధానం ఇవ్వడానికి ఆరు వారాల సమయం ఉంటుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హోం శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అంటున్నారు.

English summary
Uttar Pradesh in last 10 months: 921 encounters, 33 deaths. National Human Rights Commission (NHRC) issued a notice to Yogi Adityanath government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X