వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంగా ఉద్దవ్, డిప్యూటీ ఒక్కరే, ఎన్సీపీకి ఛాన్స్, కాంగ్రెస్‌కు స్పీకర్, రైతులకు ఆహ్వానం..

|
Google Oneindia TeluguNews

మరికొన్ని గంటల్లో మహారాష్ట్రలో ప్రగతిశీల కూటమి కొలువుదీరబోతోంది. వైరిపక్షాలు చేయి చేయి కలిపి.. ఒక్కటిగా నిలిచాయి. రాష్ట్రంలో సుస్థిర పాలన ఇస్తామని చెబుతున్నాయి. గురువారం సాయంత్రం శివాజీ పార్క్ ప్రాంగనంలో ఉద్దవ్ థాకరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 2 వేల మందితో ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు.

ఒక్కరే డిప్యూటీ

ఒక్కరే డిప్యూటీ

మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాకరే ప్రమాణం చేస్తారు. డిప్యూటీ సీఎంగా ఒక్కరే ఉంటారని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ చెప్పారు. కానీ డిప్యూటీ సీఎం కోసం ఆ పార్టీలో కుమ్ములాటలకు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుగుబాటు ఎగరేసిని అజిత్ పవార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ముందుగా జయంత్ పాటిల్ పేరు కూడా ప్రచారం జరిగింది. వీరిద్దరిలో ఎవరికీ పదవీ దక్కుతుందనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది.

స్పీకర్ పదవీ

స్పీకర్ పదవీ

కాంగ్రె్స్ పార్టీ అనుకున్నది సాధించింది. స్పీకర్ పదవీపై పట్టుబట్టి మరీ సాధించుకుంది. డిప్యూటీ స్పీకర్ పదవీ ఎన్సీపీ చేపట్టే అవకాశం ఉంది. గురువారం ఒక్కొ పార్టీ నుంచి ముగ్గురి చొప్పున ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎంగా ఉంటారు. అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రపుల్ పటేల్ సంకేతాలు ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టంచేశారు.

రైతులకు ఆహ్వానం

రైతులకు ఆహ్వానం

మరోవైపు తన ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఉద్దవ్ థాకరే కనీవినీ ఎరుగనీరీతిలో నిర్వహిస్తున్నారు. ప్రముఖులకే కాదు రైతులకు కూడా ఆహ్వానం పంపించారు. ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతు కుటుంబాలకు ఆహ్వానం పంపించారు.

పోస్లర్ల కలకలం

పోస్లర్ల కలకలం

ఇదిలాఉంటే మరోవైపు అజిత్ పవార్ భావి సీఎం అని పోస్టర్ వెలిసింది. పవార్ సొంత నియోజకవర్గం బారామతిలో అజిత్, శరద్ పవార్‌తో పోస్టర్ ఉంది. రేపు ఉద్దవ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్లెక్సీ కలకలం రేపుతోంది.

English summary
in maharashtra deputy cm will be one only ncp leader praful patel told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X