వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ కోసం ప్రెషర్: తమతోపాటు ఫ్యామిలీ మెంబర్స్‌కు కావాలట, మున్సిపల్ సిబ్బందికి ఒత్తిడి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశలో ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే టీకా అందుబాటులోకి వస్తోంది. అయితే ముంబై పురపాలక అధికారులకు కొత్త సమస్య వచ్చి పడింది. అదే రాజకీయ నేతల నుంచి ఒత్తిడి వస్తోంది. తొలి దశ వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే ఇస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. సెప్టెంబర్‌లోనే ఆ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీచేసింది. ఇంతవరకు ఓకే.. కానీ అందులో తమ కుటుంబం/ బంధువులు పేర్లను చేర్చాలని పొలిటీషియన్స్ ఒత్తిడి చేస్తున్నారు.

కోవిషిల్డ్ వ్యాక్సిన్ సేఫ్.. వాలంటీర్‌కు అనారోగ్యం ఇతర సమస్యల వల్లే: సీరంకోవిషిల్డ్ వ్యాక్సిన్ సేఫ్.. వాలంటీర్‌కు అనారోగ్యం ఇతర సమస్యల వల్లే: సీరం

ఫ్రంట్ లైన్ వారియర్స్.. పేరు, హోదాతో జాబితా అందజేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో పురపాలక అధికారులు నిమగ్నమయ్యారు. అయితే అందులో తమతోపాటు.. కుటుంబసభ్యుల పేర్లను కూడా చేర్చాలని కోరుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం రాజకీయ నేతలు మాత్రం ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకు రారు. దీంతో వారే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేర్చడం అసాధ్యం.. కానీ వారికి ఒత్తిడి మాత్రం తప్పడం లేదు.

In Maharashtra, many netas want vaccine first

Recommended Video

COVID-19 : All Party Meeting డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు పిలుపు!!

ముంబైలోనే కాదు పుణె, నాగ్‌పూర్‌లో కూడా ఇలాంటి సమస్య ఏర్పడింది. సీరం- అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తుది దశలో ఉంది. రెండు, మూడు నెలల్లో బయటకు రానుంది. ఈ క్రమంలో తొలుత అందజేసే వారి జాబితాలో చోటు కోసం ఒత్తిడి తప్పడం లేదు. ముంబై పురపాలక అధికారులను.. సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఒత్తిడికి గురిచేస్తున్నారు.

English summary
mumbai civic officials facing pressure from politicians to include their names as well as those of their family members in the lists of frontline personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X