వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్రోతో‌ జీశాట్-6ఏ ఉపగ్రహనికి తెగిన లింక్, ఏమైందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

శ్రీహరికోట: జీశాట్-6ఏ ఉపగ్రహం ఇస్రోతో సంబంధాలను తెగిపోయాయి. ఈ ఏడాది మార్చి 29న జీశాట్-6ఏ ఉపగ్రహన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని ఆ రోజే ఇస్రో ప్రకటించింది.కానీ, ఈ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో ఆదివారం నాడు ప్రకటించింది. ఉపగ్రహంతో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రకటించింది ఇస్రో.

సుమారు రూ.270 కోట్లతో ఈ ఉపగ్రహన్ని పంపింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఈ ఉపగ్రహం ద్వారా మంచి ప్రయోజనాలు దక్కుతాయని ఇస్రో ప్రకటించింది. ఈ ఉపగ్రహం రెండో దశవరకు శుక్రవారం రాత్రి 10 గంటల వరకు అంతా సవ్యంగానే సాగిందని ఇస్రో చెబుతోంది.

In Major Setback, Contact With Satellite GSAT-6A Lost, Confirms ISRO

లిక్విడ్ అపొగీ మోటార్ ప్రణాళిక ప్రకారంగానే ఫైర్ అయింది. అయితే కొన్ని క్షణాల్లోనే కమ్యూనికేషన్‌లో అవరోధాలు ఏర్పడ్డాయని సమాచారం. ఈ ఉపగ్రహం మొదటి దశ గురించి శుక్రవారం నాడు ప్రకటనను ఇస్రో విడుదల చేసింది. కానీ, ఆ తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థర్డ్ ఆర్బిట్ రైజింగ్ ఎక్సర్‌సైజ్ గురించి కూడ ఎటువంటి ప్రకటన రాలేదు.

ఇస్రోతో జీశాట్-6ఏ ఉపగ్రహం సంబంధాలను తెగిపోయిందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఉపగ్రహం ప్రయోగించిన 48 గంటల్లోనే ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి.

అయితే జీశాట్- 6ఏ ఉపగ్రహం సంబంధాలను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 1న మూడో, చివరి ఫైరింగ్ జరగవలసి ఉందని, అయితే ఉపగ్రహం నుంచి సమాచారం రావడం లేదని ఇస్రో ఆదివారం ప్రకటించింది. ఈ ఉపగ్రహంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

English summary
The Indian Space Research Organisation or ISRO has lost communications link with the powerful home-made GSAT-6A satellite, which was launched on Thursday, the space agency said in a statement today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X