వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుటుంబాల కుంపటి: మేఘాలయ అసెంబ్లీ బరిలో సంగ్మాలు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

గౌహతి: ఈ నెల 27వ తేదీన జరుగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత, సీఎం ముకుల్ సంగ్మా మరో దఫా ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రతిపక్ష బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. తద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలోనైనా అధికారంలో ఉండాలని తలపోస్తున్నది.
ఈ క్రమంలో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో పలు కుటుంబాల సభ్యులు ఒకరి కంటే ఎక్కువగా పోటీ పడుతుండటం ఆసక్తికర పరిణామం. ఇది అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేషనలిస్టు పీపుల్స్ పార్టీ, బీజేపీ వరకూ విస్తరించి ఉన్నది.

సీఎం ముకుల్ సంగ్మా చాలా బిజీబిజీ

సీఎం ముకుల్ సంగ్మా చాలా బిజీబిజీ

60 అసెంబ్లీ స్థానాలు మేఘాలయలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు 31. కాకపోతే గిరిజనుల జనాభా అత్యధికంగా ఉన్న మేఘాలయలోని 60 అసెంబ్లీ స్థానాలకు 55 స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేశారు. కుటుంబాలు, గిరిజనుల మధ్య సంబంధాలు సహజంగానే ఎన్నికల్లో గెలుపొందే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ధోరణి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. సీఎం ముకుల్ సంగ్మా చాలా బిజీగా ఉంటారు. 52 ఏళ్ల వయస్సు గల సీఎం ముకుల్ సంగ్మా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ పడుతున్నారు. అంపతి, సోంగ్సాక్ స్థానాల నుంచి పోటీలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ముకుల్ సంగ్మా సోదరుడు జెనీత్.. ఆయన భార్య సాధియారాణి కూడా

ముకుల్ సంగ్మా సోదరుడు జెనీత్.. ఆయన భార్య సాధియారాణి కూడా

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కుటుంబ సభ్యులు పోటీ చేయడం తప్పేమీ కాదు. కానీ మేఘాలయ వంటి రాష్ట్రంలో ఒక రాజకీయ కుటుంబం ఎన్నికల్లో పోటీ చేయడం పెద్ద చర్చగా మారింది. సీఎం ముకుల్ సంగ్మా సతీమణి దిక్కాంచీ డీ శిరా తిరిగి మహేంద్రగంజ్ స్థానం నుంచి ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్నారు. రంగ్సాకోనా నుంచి ముకుల్ సంగ్మా సోదరుడు జెనీత్ సంగ్మా, గాంబెర్జె స్థానంలో రంగ్సాకోనా భార్య సాధియారాణి ఎం సంగ్మా తొలిసారి తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేస్తుండటం ఆసక్తి కర పరిణామం.

మేఘాలయ రాజకీయాల్లో పీఏ సంగ్మా కుటుంబ సభ్యులు కీలకం

మేఘాలయ రాజకీయాల్లో పీఏ సంగ్మా కుటుంబ సభ్యులు కీలకం

ఒక కుటుంబంలో అత్యధికులు ఎన్నికల్లో టిక్కెట్ పొందడంతో సంబంధిత కుటుంబానికి చెందిన వారి చేతిలోనే పూర్తిగా అధికారం కేంద్రీక్రుతం అవుతుంది. ఇది ప్రజాతంత్ర వాతావరణం ఎంత మాత్రమూ కాదని ఆధిపత్య రాజకీయం అని జర్నలిస్టు పత్రిక ముఖిం వ్యాఖ్యానించారు. ముకుల్ సంగ్మా కుటుంబం తర్వాత మేఘాలయ రాజకీయాల్లో క్రియశీలంగా ఉన్న ఫ్యామిలీ. లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుటుంబ సభ్యులు కూడా కీలకంగా ఉన్నారు. పీఏ సంగ్మా పెద్ద కుమారుడు జేమ్స్ సంగ్మా.. తన సోదరుడు కన్రడ్ సంగ్మా సారథ్యంలోని నేషనలిస్టు పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) తరఫున దాదెంగ్రీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.

మేఘాలయలో ఎవరి దారి వారిదే

మేఘాలయలో ఎవరి దారి వారిదే

కేంద్రంలో అధికారంలో అధికార ఎన్డీయే మిత్రపక్షం ఎన్పీపీ. కానీ రాష్ట్ర స్థాయిలో బీజేపీ విడిగా పోటీ చేస్తోంది. బీజేపీ తరఫున జేమ్స్ సోదరి అగథా సంగ్మా.. దక్షిణ తుర స్థానం నుంచి పోటీలో ఉన్నారు. దక్షిణ తుర స్థానం తొలి నుంచి పీఏ సంగ్మా కుటుంబానికి ఎన్నికల యుద్ధ క్షేత్రంగా ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఆమెకు వ్యతిరేకంగా అగథా సంగ్మా బంధువు అనామిక జీ మొమిన్ ఎన్నికల బరిలో నిలువడం ఆసక్తి కర పరిణామం. ఇక మేఘాలయ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత సంపన్నుడు నైగంట్లాంగ్ ధర్ తిరిగి ఎన్పీపీ స్థానం నుంచి ఉమ్రోయి స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఆయన సోదరుడు మాజీ మంత్రి స్నియాభాలాంగ్ తిరిగి నార్టియాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

డొంకుపర్ మస్సార్ ప్రత్యర్థి ఆయన భార్యే

డొంకుపర్ మస్సార్ ప్రత్యర్థి ఆయన భార్యే

ఎన్నీపీ తరఫున నైగంగ్లాంగ్ ధర కుమారుడు దాసాఖైత్బా లమారే కూడా మావ్హతినుంచి, ప్యానుర్స్‌లా అసెంబ్లీ స్థానం నుంచి నైగంగ్లాంగ్ ధర బావ మరిది వైలాద్మికి శెల్యా పోటీలో ఉన్నారు. రాణికోర్ నుంచి మాజీ మంత్రి డొంకుపర్ మస్సార్ పోటీ పడుతున్నా అదీ ఎన్పీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె భార్య గ్రేస్ మ్యారీ ఖార్పూరీ ఆయనకు ప్రత్యర్థి కావడం మరో విశేషం. తల్లీ కూతుళ్లు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మావ్ఫ్లాంగ్ నుంచి హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ తరఫున పీఎం శైమ్, మైల్లియం స్థానం నుంచి ఆయన తనయ తైలినియా ఎస్ థంగ్ఖేవ్యూ పోటీలో ఉన్నారు.

మార్చి మూడో తేదీన ఇలా ఎన్నికల ఫలితాలు

మార్చి మూడో తేదీన ఇలా ఎన్నికల ఫలితాలు

మేఘాలయ అసెంబ్లీ మాజీ స్పీకర్ చార్లెస్ ప్యాంగ్రోప్, ఆయన కుమారుడు డేవిడ్ నాంగ్రోమ్ కూడా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న చార్లెస్ పాంగ్రోమ్.. నాంగ్థైమ్మాయి నుంచి బరిలో నిలగా, మావర్యంగ్కెంగ్ నుంచి ఆయన కుమారుడు డేవిడ్ నాంగ్రోమ్ తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షిల్లాంగ్ కేంద్రంగా పని చేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రగతికి ఆటంకంగా నిలుస్తాయన్నారు. అయితే వీరిలో ఎంత మంది విజయం సాధిస్తారన్నది తెలియాలంటే మార్చి మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే మరి.

English summary
Across political parties, several members from a family are contesting the assembly election. Meghalaya chief minister Mukul Sangma is a busy man. He is fighting a tough battle to ward off the BJP to ensure another term for the Congress in the Northeastern state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X