వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయ్‌బరేలీ ఎన్‌టిపిసిలో పేలుడు: ఇంజనీర్లు, కార్మికుల అరుపులు (వీడియో)

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ పేలుడు ఘటనకు సంబంధించి మొబైల్‌లో రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ పేలుడు ఘటనకు సంబంధించి మొబైల్‌లో రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో సజీవదృశ్యమౌతున్న ఇంజనీర్ల అరుపులు ఈ వీడియోలో విన్పిస్తున్నాయి. అంతేకాదు దట్టమైన పొగ అలముకొంటున్న దృశ్యాలు కూడ కన్పించాయి.

రాయ్‌ బరేలీ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 32కి చేరింది. తీవ్ర గాయాలపాలైన 12 మందిని ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నిపుణులతో కూడిన కమిటీని నియమించింది ప్రభుత్వం. 30 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది..

ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఆదిత్యానాథ్‌ ప్రభుత్వానికి ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే బాయిలర్‌ను ఇంజనీర్లు అమర్చే క్రమంలోనే పేలుడు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే అది లోపల కాకుండా బయట మాత్రమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సమస్య ఉందని తెలిసి కూడా యూనిట్ ను ఎందుకు మూసేయలేదన్న ప్రశ్నకు.. మరమత్తులు చేయలేమన్న సమయంలో మాత్రమే తాము వాటిని మూసేస్తామని, ఢిల్లీలోని కంట్రోల్‌ రూమ్‌కు కూడా ఈ మేరకు పూర్తి సమాచారం పంపించామని అధికారులు చెబుతున్నారు.

ఇక ఘటన జరిగిన అనంతరం అక్కడ నమోదైన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బాయిలర్‌లో పేలుడు ధాటికి మంటలు, పెద్ద ఎత్తున్న పొగ వెలువడటం అందులో చూడొచ్చు. ఆ సమయంలో అక్కడ పని చేసే వారి అరుపులు అందులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఓ వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఉంచహర్‌ ప్లాంట్‌లోని ఆరో యూనిట్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడుతో ప్రమాదం సంభవించింది. వేడి వాయువులు, నీటి ఆవిరితో సమీపంలో పనిచేస్తున్న కార్మికులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 100 మందికి గాయాలు కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

English summary
Flames, smoke and hissing steam can be seen in dramatic footage shot on mobile phones inside the unit at state-run NTPC's power plant in Raebareli in Uttar Pradesh, where a boiler blast killed 32 and left many injured on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X