బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో అక్కా, చెల్లి పెళ్లి, కాపురం: తలపట్టుకున్న ఫ్యామిలీ, కేసు !

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం ఓ విడ్డూరానికి వేదికైయ్యింది. వరుసకు అక్కా, చెల్లలు అయిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని రహస్యంగా కాపురం చేస్తూ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరం ఓ విడ్డూరానికి వేదికైయ్యింది. వరుసకు అక్కా, చెల్లలు అయిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని రహస్యంగా కాపురం చేస్తూ కుటుంబ సభ్యులతో సహ నగర ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారు.

మమ్మల్ని ఎక్కడ విడదీస్తారో అంటూ ఇప్పుడు స్వచ్చంద సంస్థ నిర్వహకులు, స్వలింగ సంపర్క సంఘాలను, లాయర్లను ఆశ్రయించిన అక్కా, చెల్లి వారి కుటుంబ సభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దెబ్బతో విస్తు పోయిన బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలోని వనితా సహాయవాణి సీనియర్ కౌన్సిలర్లు ఇద్దరు యువతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

అక్క ఉద్యోగి, చెల్లి స్టూడెంట్

అక్క ఉద్యోగి, చెల్లి స్టూడెంట్

బెంగళూరు నగరంలోని విజయ నగరలో 25 ఏళ్ల యువతి నివాసం ఉంటుంది. ఈమె కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తోంది. ఈమె పక్కింటిలోనే చిన్నమ్మ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. కాల్ సెంటర్ యువతి చెల్లికి 21 ఏళ్లు. బెంగళూరులోని ప్రైవేట్ కాలేజ్ లో బీకాం చదువుతోంది.

చెల్లి అబ్బాయి అయ్యింది

చెల్లి అబ్బాయి అయ్యింది

బీకాం విద్యార్థిని నిత్యం అబ్బాయిలాగా తయారై వరుసకు అక్క అయిన కాల్ సెంటర్ ఉద్యోగితో చనువుగా ఉంటోంది. నన్ను ప్రేమించాలని కాల్ సెంటర్ ఉద్యోగిని మీద ఒత్తిడి చేసింది. అయితే తనను ఆట పట్టిస్తోందని మొదట ఆమె పెద్దగా పట్టించుకోలేదు.

ప్రేమకు ఓకే, సినిమాలు, షికార్లు

ప్రేమకు ఓకే, సినిమాలు, షికార్లు

అయితే బీకాం విద్యార్థిని మాత్రం అక్కను వదల్లేదు. నన్నే ప్రేమించాలని మరింత ఒత్తిడి చేసింది. చివరికి కాల్ సెంటర్ ఉద్యోగిని చెల్లి ప్రేమను అంగీకరించింది. అప్పటి నుంచి ఇద్దరూ వీలు చిక్కినప్పుడు సినిమాలు, షికార్లకు వెలుతున్నారు.

ఇంటి నుంచి ఎస్కేప్

ఇంటి నుంచి ఎస్కేప్

అక్కా, చెల్లి బయటకు వెలుతుంటే కుటుంబ సభ్యులకు ఏమాత్రం అనుమానం రాలేదు. మన పెళ్లికి పెద్దలు అంగీకరించరిని తెలుసుకున్న అక్కా, చెల్లి ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుని మే 17వ తేది ఇద్దరూ ఇల్లు విడిచి పారిపోయి కోరమంగలలోని ఓ గుడిలో వివాహం చేసుకున్నారు.

కోరమంగలలో కాపురం

కోరమంగలలో కాపురం

పెళ్లి చేసుకున్న తరువాత కోరమంగలలో ఓ అద్దె గది తీసుకుని కాపురం పెట్టారు. బీకాం విద్యార్థి కాలేజ్ కు వెళ్లకుండా ఇంటిలోనే ఉంటోంది. ఆమె అక్క మాత్రం ఉద్యోగం చేస్తోంది. తమ కుమార్తె కనపడటం లేదని బీకాం విద్యార్థిని కుటుంబ సభ్యులు విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షాపింగ్ చేస్తూ చిక్కారు

షాపింగ్ చేస్తూ చిక్కారు

పోలీసులు అప్పటి నుంచి వీరి కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం సోమవారం వీరిద్దరూ కోరమంగలలో షాపింగ్ చేస్తున్న విషయం గుర్తించిన పోలీసులు వారిని విచారించారు. ఇద్దరం పెళ్లి చేసుకున్నామని సమాధానం ఇవ్వడంతో పోలీసులు షాక్ కు గురైనారు.

చేతులు ఎత్తేసిన పోలీసులు

చేతులు ఎత్తేసిన పోలీసులు

అక్కా, చెల్లి ఇద్దరూ వివాహం చేసుకుని కోరమంగలలో కాపురం పెట్టారని పోలీసులు బీకాం విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు అయినందున మేము ఏమీ చెయ్యలేమని పోలీసులు చేతులు ఎత్తేశారు.

మీరే కాపాడండి

మీరే కాపాడండి

అక్కా, చెల్లి పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అవమానంతో కుమిలిపోయి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలోని వనితా సహాయవాణిలో అక్కా, చెల్లికి ప్రస్తుతం కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

బెంగళూరులో ఇదే మొదటి పెళ్లి

బెంగళూరులో ఇదే మొదటి పెళ్లి

భారతదేశంలో స్వలింగ సంపర్కరం నేరం అని, అయితే బాధితులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు అవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న అక్కా, చెల్లికి మేము అండగా ఉంటామని కొందరు స్వలింగ సంపర్కులు చెబుతున్నారు. బెంగళూరు నగరంలో స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం ఇదే మొదటి సారి కావడంతో ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

English summary
In perhaps the first lesbian 'wedding' in Bengaluru, a 25-year-old woman tied the knot with a 21-year-old at a temple in Koramangala. The parents of the younger woman have filed a complaint with the police, who are now "counselling" the couple and hope to "make them realize" the negative fallout of their decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X