బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అట్టుడికిన బెంగళూరు: వెనక్కి తగ్గిన ప్రభుత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) విత్‌డ్రాయల్‌ నిబంధనలకు వ్యతిరేకంగా బెంగళూరులోని వస్త్ర పరిశ్రమల ఉద్యోగులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు మంగళవారంనాడు తీవ్ర నిరసన చేపట్టారు. వాహనాలకు నిప్పంటించారు.

ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌) కొత్త నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బెంగళూరులో వస్త్ర పరిశ్రమల ఉద్యోగులు చేపట్టిన ఆందోళనపై ఆయన ఢిల్లీలోస్పందించారు. ఆందోళన చేసేవారంతా వలస కార్మికులేనని కేంద్రమంత్రి తెలిపారు.

పీఎఫ్‌ కొత్త నిబంధనతో తమకు అన్యాయం జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్మికులకు నష్టం కలగకూడదనేదే ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. నూతన నిబంబధనలపై అన్ని వర్గాలతో చర్చల తర్వాతే తుది నిర్ణయం చేశామని దత్తాత్రేయ చెప్పారు.

ప్రావిడెంట్‌ ఫండ్‌(పీఎఫ్‌)కు సంబంధించిన ప్రవేశపెట్టిన కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నూతన నిబంధనలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పీఎఫ్‌ నిబంధనల అమలును మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

పీఎఫ్‌ డబ్బును 58ఏళ్లు నిండిన తర్వాతే తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధనను తీసుకుని వచ్చింది. గతంలో రిటైర్మెంట్‌కు ముందు కూడా ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువు తదితర ముఖ్య కారణాలకు డబ్బు తీసుకోగలిగే వెసులుబాటు ఉండేది.

రాళ్లు రువ్వారు...

రాళ్లు రువ్వారు...

రాళ్లు రువ్వారు. మార్చిన పీఎఫ్‌ నిబంధనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వస్త్ర పరిశ్రమ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పిఎఫ్ తగ్గుతుంది....

పిఎఫ్ తగ్గుతుంది....

కొత్త నిబంధనల వల్ల తమకు పీఎఫ్‌ డబ్బు తక్కువగా వస్తుందనే భయంతో వారు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం వేలాది ఆందోళనకారులు మైసూర్‌-బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.

నిలిచిన వాహనాలు...

నిలిచిన వాహనాలు...

జాతీయ రహదారిని దిగ్భంధించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి చాలా సేపు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నగరంలో వందలాది వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి.

తీవ్ర ఉద్రిక్తత

తీవ్ర ఉద్రిక్తత

దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మంగళవారంనాడు హోసూర్‌ రోడ్‌, తుమ్‌కూర్‌ రోడ్‌, జలహల్లి ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. పోలీసులు పరిస్థితి అదుపుచేసేందుకు ప్రయత్నించారు

గాయపడిన కార్మికులు

గాయపడిన కార్మికులు

పోలీసుల లాఠీచార్జీతో మంగళవారంనాడు కార్మికులు పలువురు గాయపడ్డురు. కార్మికుల ఆందోళనతో బెంగళూరులో దాదాపు 7 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.

English summary
For the second day in a row, garment factory workers brought traffic to a standstill on Hosur Road as thousands of them protested at the Bommanahalli junction on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X