వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం గ్రాండ్ బర్త్ డే: రెహ్మాన్ పాట, గర్ల్స్ డ్యాన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలు ఉత్తర ప్రదేశ్‌లోని సైఫై గ్రామంలో ఉన్న క్రీడా మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఇది విమర్శలకు దారి తీసింది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ములాయం 77 కేజీల కేకును కట్ చేశారు.

ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గైర్హాజరయ్యారు. అమర్ సింగ్ హాజరయ్యారు. అమర్ సింగ్ గతంలో సమాజ్ వాది పార్టీ నేత. ఆ తర్వాత విభేదాలు వచ్చి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

 ములాయం పుట్టిన రోజు వేడుకలు

ములాయం పుట్టిన రోజు వేడుకలు

సమాజ్ వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఆయన స్వగ్రామమైన సైఫైలో ఈ వేడుకలు జరిగాయి. ములాయం కట్ చేశారు.

ములాయం పుట్టిన రోజు వేడుకలు

ములాయం పుట్టిన రోజు వేడుకలు

ఈ వేడుకలకు రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు, సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు.

ములాయం పుట్టిన రోజు వేడుకలు

ములాయం పుట్టిన రోజు వేడుకలు

అయితే, ఇంత సందడిగా, అట్టహాసంగా జరిగిన ములాయం సింగ్ బర్త్ డే వేడుకలకు లాలూ గైర్హాజరీ వెనుక.. ఏమైనా కారణం ఉందేమోనని భావిస్తున్నారు. బీహార్‌లో నితీశ్ ప్రమాణ స్వీకారానికి ములాయం వెళ్లని కారణంగానే లాలూ ఈ వేడుకలకు దూరంగా ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ములాయం పుట్టిన రోజు వేడుకలు

ములాయం పుట్టిన రోజు వేడుకలు

ములాయం సింగ్ పుట్టిన రోజు వేడుకలకు భారీ మొత్తంలోనే ఖర్చయిందని, ఇదంతా ప్రభుత్వం సొమ్మేనని పలు విమర్శలు వస్తున్నాయి.

ములాయం పుట్టిన రోజు వేడుకలు

ములాయం పుట్టిన రోజు వేడుకలు

తన పుట్టిన రోజు నాడు ములాయం సింగ్ యాదవ్... అమ్మాయిలు చదువుకోవాలని సూచించారు. పన్నెండో తరగతి వరకు విద్యార్థినీలకు తమ ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తుందన్నారు. కాగా, రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరువు ఉంటే అట్టహాసంగా పుట్టిన రోజు వేడుకలు ఏమిటని కాంగ్రెస్, బిజెపి విమర్శిస్తున్నాయి.

 రెహ్మాన్ సంగీత కచేరీ

రెహ్మాన్ సంగీత కచేరీ

ములాయం సింగ్ పుట్టిన రోజు నేపథ్యంలో రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ బృందంతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు.

హరిహరన్ బృందం

హరిహరన్ బృందం

ములాయం సింగ్ పుట్టిన రోజు నేపథ్యంలో హరిహరన్ బృందం గానం, ప్రదర్శన దృశ్యం. శనివారం ఈ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

English summary
Samajwadi Party chief Mulayam Singh Yadav's 77th extravagant birthday celebrations garnered huge media attention on Sunday, Nov 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X