వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితిన్ గడ్కరీ నీతి మాటలు నిర్లక్షం చేసిన శివసేన, చెక్, మోదీ, షా వ్యూహంతో పవార్ కు పదవి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్ మారాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల ప్రభుత్వం ఏర్పాటు అయితే ఆ సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని, అలాంటి అపవిత్ర బంధం ఎక్కువ రోజులు ఉండదని శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నీతి మాటలు చెప్పినా శివసేన నిర్లక్షం చెయ్యడం వలనే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఫలితం అనుభవిస్తున్నారు.

సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!సతీ సావిత్రి, భర్తను చంపేసి వంటిట్లో పూడ్చేసి పొయ్యి పెట్టి వెరైటీ వంటలు, అక్రమ సంబంధం!

నితిన్ గడ్కరీ నీతి మాటలు

నితిన్ గడ్కరీ నీతి మాటలు

మహారాష్ట్రలో బీజేపీ నాయకుడే సీఎం అవుతారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ధీమాగా చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నీతి మాటలను శివసేన పట్టించుకోకుండా నిర్లక్షం చేసిందని, ఆయన మాటలు పెడచెవిన పెట్టినందుకు నేడు ఫలితం అనుభవించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మహారాష్ట్రలో క్రికెట్ మ్యాచ్ మలుపు

మహారాష్ట్రలో క్రికెట్ మ్యాచ్ మలుపు

రాజకీయాల్లో, క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో, క్రికెట్ మ్యాచ్ లో ఏమైనా జరగచ్చు, అది ముందుగా ఊహించడం ఎవ్వరికీ సాధ్యం కాదని నితిన్ గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే. క్రికెట్ లో ఇక మ్యాచ్ మా వైపే ఉంది, విజయం మాదే అనుకుంటున్న సమయంలో ఫలితం మారిపోయే అవకాశం ఉందని, రాజకీయాలు అంతే అని నితిన్ గడ్కరీ చెప్పిన మాటలు మహారాష్ట్రలో అక్షరాల నిజం అయ్యింది.

 ఊహించలేని శివసేన

ఊహించలేని శివసేన

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాటలను శివసేన, కాంగ్రెస్ నాయకులు క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారు. రాత్రికి రాత్రి ఏం జరుగుతుందిలే, శనివారం మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము కాదా అని భావించారు. అయితే బీజేపీ నాయకుల వ్యూహాలను పసిగట్టడంలో శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా విఫలం అయ్యారు. నితిన్ గడ్కరీ చెప్పినట్లే మహారాష్ట్రలో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ నేడు సీఎం అయ్యారు.

 మోదీ, అమిత్ షా చతురత ఫలితం

మోదీ, అమిత్ షా చతురత ఫలితం

గతంలో కర్ణాటక, గోవా అనుభవాలను గుర్తు తెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం మహారాష్ట్రలో అలాంటి వ్యూహాలను అమలు చేసింది. నరేంద్ర మోదీ, అమిత్ షా చతురత ఫలితంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను తమ వైపు తిప్పుకున్నారని తెలిసింది. సీఎం కుర్చీ కోసం బీజేపీతో వైరం పెట్టుకున్న శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు గట్టి గుణపాఠం చెప్పాలని అజిత్ పవార్ ను ఆస్త్రంగా చేసుకున్నారని తెలిసింది.

English summary
Mumbai: In Politics And Cricket Nothing Can Predict: Earlier Hint Given By Union Minister Nitin Gadkari Over Maharasthra Government Formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X