వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ టెక్కీలకు బ్యాడ్ న్యూస్: విప్రోలో సగానికి పైగా ఉద్యోగాలు అమెరికన్లకే!

అమెరికా పెట్టుబడులు సంస్థకు చాలా కీలకమైనవి కావడం.. వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో.. క్యూ1లో 50శాతం మేర ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు విప్రో ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇండియన్ టెక్కీలను కలవరపరుస్తున్నాయి. స్థానికులకే పెద్ద పీట వేసేలా హెచ్1బి వీసా నిబంధనలు సడలించడంతో ఆయా కంపెనీలు అందుకు అనుగుణంగా రిక్రూట్ మెంట్లు జరపాలని యోచిస్తున్నాయి.

తాజాగా టెక్ దిగ్గజం విప్రో సైతం అమెరికా రిక్రూట్ మెంట్లలో సగానికి పైగా స్థానికులకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. తమ ఖాతాదారులకు వ్యాపార కొనసాగింపు పట్ల భరోసా ఇస్తూ.. మరో రెండు డెలివరీ కేంద్రాలను విప్రో ఏర్పాటు చేసుకుంది. మిచిగాన్, కాలిఫోర్నియాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

in q1 more than 50employees to be locals in us wipro

కాగా, మిచిగాన్ లో ఏర్పాటు చేసిన కేంద్రం ఆటోమోటివ్ కస్టమర్లకు ఇంజనీరింగ్ సేవలను అందిస్తుందని, కాలిఫోర్నియా కేంద్రం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ హబ్ గా ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అమెరికా పెట్టుబడులు సంస్థకు చాలా కీలకమైనవి కావడం.. వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో.. క్యూ1లో 50శాతం మేర ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు విప్రో ప్రకటించింది. అన్ని కీలక మార్కెట్లలో స్థానికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. ఈ క్రమంలోనే తమ అతిపెద్ద మార్కెట్ అమెరికా క్యూ1లో 50శాతం కంటే ఎక్కువ మంది స్థానికులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు విప్రో సీఈవో అబిదిలి జెడ్ నీముచ్వాలా తెలిపారు.

English summary
IT firm WiproBSE -0.74 % expects locals to constitute more than half of its workforce in the US by June as it continues to make "significant" investments in the American market amid tightening of visa norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X