వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల్ మీటర్ : బెంగాల్‌లో అత్యధికం, కశ్మీర్‌లో అత్యల్ప ఓటింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా పూర్తయ్యింది. గురువారం 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. కర్ణాటకలోని మాండ్య, బెంగాల్, మిజోరంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా .. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

in second phase : bengal highest, kashmir lowest poll

తమిళనాడు, యూపీలో ఆలస్యం ..
సాయంత్రం 5 గంటలవరకు ఆయా చోట్ల పోలింగ్ ముగిసింది. కానీ తమిళనాడు, యూపీలోని మథురలో మాత్రం రాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. కడపటి వార్తలు అందేసరికి పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 75.27 శాతం పోలింగ్ నమోదవగా ... జమ్ముకశ్మీర్‌లో అత్యల్పంగా 43.37 శాతంగా ఉందని ఎన్నికల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రాలవారీగా చూస్తే ..
బెంగాల్ తర్వాత మణిపూర్‌లో 74.69 శాతం ఓటింగ్ జరిగింది. అసోం 73.32 శాతం, పుదుచ్చేరి 72.40 శాతం, ఛత్తీస్ గఢ్ 68.70 శాతంగా వరుసగా పోలింగ్ జరిగింది. కర్ణాటక 61.80, తమిళనాడు 61.52, బీహర్ 58.14, ఉత్తర్ ప్రదేశ్ 58.12, ఒడిశా 57.41, మహారాష్ట్ర 55.37, జమ్ముకశ్మీర్‌లో అతి తక్కువగా 43.37 శాతం పోలింగ్ జరిగినట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.

English summary
The second phase of polling in the general election is complete. On Thursday, 11 states and 95 constituencies in a union territory were polled. In the states of Mandya, Bengal and Mizoram in Karnataka, the situation has been tense and polling is peaceful in the rest of the states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X