వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంచల్‌‌పై అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి పట్టుంది కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకూ సానుకూలమే!

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్రాంతంపై ఈ పార్టీకి మంచి పట్టుంది. అయితే, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ప్రాంతం నుంచి అధిక ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేశాయి.

 బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్ బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నితీష్ కుమార్ తేజస్వీయాదవ్ ముందు తలొంచుతాడు .. చిరాగ్ ఫైర్

కిషన్ గంజ్ శివారులోని రుయిధాస్ మైదానంలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించి ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమికి ఓటేయాలని కోరారు. కాగా, ఇదే మైదానంలో గత డిసెంబర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఓవైసీ నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. రాహుల్ గాంధీ కంటే ఓవైసీనే బాగా మాట్లాడారని, ఇక్కడ ఓవైసీకే ఎక్కువ ప్రజాదరణ ఉందని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉండటం గమనార్హం.

In Seemanchal, Owaisi popular but it remains advantage RJD, Congress

2019 ఎన్నికల్లోనే కిషన్‌గంజ్ అసెంబ్లీ స్థానాన్ని తొలిసారి ఏఐఎంఐఎం కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా ఆ స్థానంలో మరోసారి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ఓవైసీ పెట్టిన సభకు ఇక్కడి జనాలు బాగా ఆకర్షితులయ్యారు. తమకు అండగా ఓవైసీ ఉన్నారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఓవైసీకి చాలా మంది అభిమానులున్నారని తెలిపారు.

ఎంఐఎం అభ్యర్థిని గెలిపించాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని స్థానిక టైలర్ జీషాన్ వెల్లడించారు. మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కొందరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ముస్లిం ఓట్లను విభజించడానికే.. ఏఐఎంఐఎంను బీజేపీ ముందుకు తీసుకువెళుతుందని కాంగ్రెస్, ఆర్జేడీ పదేపదే విమర్శిస్తున్నాయి.

సీమాంచల్ ఉన్న 24 సీట్లలో.. మహాగత్బంధన్ ప్రస్తుత రూపంలో (ఆర్జేడీ, కాంగ్రెస్, మూడు వామపక్షాలు) 14, ఎన్డీఏ తొమ్మిది, ఏఐఎంఐఎం ఒక స్థానాలను కలిగి ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆర్‌ఎల్‌ఎస్‌పి, బిఎస్‌పిలతో కలిసి 20 స్థానాలకు ఏఐఎంఐఎం పోటీ పడుతోంది. సీమాంచల్ ప్రాంతంలో ఎక్కువగా కాంగ్రెస్, ఆర్జేడీలకు సానుకూలంగా ఉన్నాయి. ఎంఐఎం ఎంట్రీతో కాస్త మార్పువచ్చింది. ఆ రెండు పార్టీలతోపాటు ఎంఐఎం పార్టీవైపు చూస్తున్నారు ఇక్కడి ఓటర్లు.

కాగా, పార్టీల ప్రచారం ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా జాతీయ సమస్యల గురించి ఉంది. సీఏఏపై తీసుకున్న వైఖరిని ఏఐఎంఐఎం ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంది, ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ బుధవారం కేంద్రం వారిని "వేధిస్తున్నందున" పార్టీ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇచ్చారు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ, "ఎవరినీ దేశం బయటకు నెట్టే శక్తి ఎవరికీ లేదు." అని స్పష్టం చేశారు.

English summary
In Seemanchal, Owaisi popular but it remains advantage RJD, Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X