వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, ఆర్జేడీకి షాక్: బీహార్ ఎన్నికల ముందు మహాఘట్‌బంధన్‌కు మాంఝీ గుడ్‌బై

|
Google Oneindia TeluguNews

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ తోపాటు ఆర్జేడీకి భారీ షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలతోపాటు మరికొన్ని పార్టీలతో ఏర్పాటు చేసిన మహాఘట్‌బంధన్‌కు మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ నాయకత్వంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా(సెక్యూలర్) గుడ్ బై చెప్పింది.

గురువారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో హిందుస్థాన్ అవామ్ మోర్చా(సెక్యూలర్) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్థనపై ఎలాంటి ముందడుగు పడకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేసిన జీతన్ రామ్ మాంఝీ.. మహా‌ఘట్ బంధన్‌ నుంచి వైదొలిగారు.

In Setback to Congress and RJD: Jitan Ram Manjhis party Quits Grand Alliance ahead of Bihar Polls

కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని తాము ఎప్పటినుంచో కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తన సొంత అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తున్నారని జితన్ రామ్ మాంజీ తనయుడు, ఎమ్మెల్సీ సంతోష్ సుమన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న పార్టీలు ఏం చెప్పినా.. తేజస్వి యాదవ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మాంఝీ పార్టీ వైదొలగడంతో ఆర్జేడీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్‌పీ), వికాషీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) మహాఘట్ బంధన్‌లో భాగస్వాములుగా ఉన్నాయి.

Recommended Video

Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu

కాగా, జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన అనంతరం సొంత పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ ఉన్న ఎన్డీయే కూటమిలోకి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మాంఝీ ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ.. త్వరలోనే స్పష్టత వస్తుందని రాష్ట్ర రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, బీహార్ రాష్ట్రంలో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వషయం తెలిసిందే.

English summary
In a setback to the opposition unity in Bihar, former chief minister Jitan Ram Manjhi-led Hindustani Awam Morcha (Secular) on Thursday quit the Grand Alliance (Mahagathbandhan), but chose to maintain silence on its future moves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X