వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంకు సినిమా చూపిస్తున్న ఎమ్మెల్యేలు, మాజీ సీఎంతో భేటీ, ఏం చెయ్యాలి, బీజేపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి అసమ్మతి ఎమ్మెల్యేలు సినిమా చూపిస్తున్నారు. శుక్రవారం మద్యాహ్నం ముఖ్యమంత్రి కుమారస్వామి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చర్చించారు.

నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి ఎమ్మెల్యేలకు ఫోన్లు!నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు జాగ్రత్త, రాత్రి ఎమ్మెల్యేలకు ఫోన్లు!

సీఎం కుమారస్వామి అధికారిక నివాసం కృష్ణ పక్కనే మాజీ సీఎం సిద్దరామయ్య నివాసం కావేరీ ఉంది. సీఎం అయినప్పటి నుంచి అధికారిక నివాసం కృష్ణకు వెలుతున్న కుమారస్వామి ఎప్పుడూ కావేరీలోని సిద్దరామయ్య ఇంటికి వెళ్లలేదు.

ముప్పుతిప్పలు

ముప్పుతిప్పలు

రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముప్పుతిప్పులు పెడుతున్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని బహిరంగంగా అంటున్నారు. ఈ నేపధ్యంలో సీఎం కుమారస్వామి మాజీ సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యి కొన్ని గంటల పాటు చర్చించారు.

సీఎం వస్తారని తెలీదు

సీఎం వస్తారని తెలీదు

సీఎం సిద్దరామయ్య ఇంటిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో సీఎం కుమారస్వామి సమాచారం ఇవ్వకుండానే అక్కడికి చేరుకున్నారు.

బీజేపీ టార్టెట్

బీజేపీ టార్టెట్

గురువారం సాయంత్రం సీఎం కుమారస్వామి హాసన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కుమారస్వామి మీద బీజేపీ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. కుమారస్వామి వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారని సమాచారం.

నోరు జారకూడదు

నోరు జారకూడదు

మీకు ఎంతో అనుభవం ఉంది. గతంలో సీఎంగా పని చేశారు. ఎదైనా మాట్లాడే సమయంలో ఆచూతూచి మాట్లాడాలని సిద్దరామయ్య సీఎం కుమారస్వామికి సలహా ఇచ్చారని సమాచారం. సంకీర్ణ ప్రభుత్వం కాపాడుకోవడం అందరికీ మంచిదని, ఎవ్వరూ నోరుజారకూడదని సిద్దరామయ్య సూచించారని తెలిసింది.

కేంద్రం పగ

కేంద్రం పగ

మంత్రి డీకే. శివకుమార్ ను టార్గెట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖలతో ఆయన మీద కేసులు నమోదు చేయిస్తోందని, దానిని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొకుంటే బీజేపీని కట్టడి చెయ్యడం సాధ్యం కాదని ఇదే పందర్బంలో వీరి మద్య చర్చ జరిగిందని సమాచారం.

English summary
In a surprising political development chief minister HDK has met former CM siddaramaiah at his cauveri residence on Friday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X