వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో .. 1300 కిలోల బంగారం : తమిళనాడులో పట్టుకున్న ఫ్లైయింగ్ స్కాడ్స్

|
Google Oneindia TeluguNews

చెన్నై : సార్వత్రిక ఎన్నికల వేళ నగదు, ఆభరణాలు పట్టుబడటం చూస్తుంటాం. కానీ 1300 పైచిలుకు కిలోల బంగారం తమిళనాడులో పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ బంగారం ఎక్కడిదీ ? ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్నారా అనే అనుమనాలు కలుగుతున్నాయి. బంగారం తరలిస్తున్న ఐదుగురిని ఫ్లైయింగ్ స్కాడ్స్ విచారిస్తున్నారు.

2 వ్యాన్లలో తరలింపు

2 వ్యాన్లలో తరలింపు

వేపంబట్టు నుంచి 2 వ్యాన్లలో భారీగా బంగారం తరలిస్తున్నారు. బంగారం 1381 నుంచి 1407 కిలోల ఉంటుందని అధికారులు చెప్తున్నారు. బంగారం తరలిస్తున్న ఐదుగురిని ఫ్లైయింగ్ స్కాడ్స్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి
ఇంతమొత్తంలో బంగారం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బంగారం ఎవరు ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడికి తరలిస్తున్నారా అనే అంశం తెలియాల్సి ఉంది.

 టీటీడీకి చెందినదా ?

టీటీడీకి చెందినదా ?

పట్టుబడిన బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రముఖ పుణ్యక్షేత్రం టీటీడీకి చెందిన బంగారమైతే ? ఎవరు తరలిస్తున్నారు ? ఎందుకు తరలిస్తున్నారు ? బోర్డుకు ఉన్న విశ్వసనీయత ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 ట్రెజరీకి తరలింపు

ట్రెజరీకి తరలింపు

ఐదుగురి నిందితులను ప్లైయింగ్ స్కాడ్లు విచారిస్తున్నారు. వారి ఇచ్చే సమాచారాన్ని బట్టి తదుపరి ఇంటరాగేషన్ ఉంటుందని చెప్తున్నారు. బంగారాన్ని పూందమలై ట్రెజరీకి తరలించారు. నిన్ని కనిమొళి ఇంట్లో ఐటీ దాడులు, డీఎంకే నేతల ఇళ్లలో దాడులు నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పుడు ఏకంగా 1300 కిలోల బంగారం పట్టుబడటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ బంగారానికి సంబంధించి పోలీసు విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది.

English summary
Gold is moving heavily in 2 vanss from Thampambattu. Officials say gold is 1381 to 1407 kg. Five of the gold moves are taken into custody by the officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X