• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

2జీ స్కామ్: కాగ్ వినోద్ రాయ్ ‘సూత్రధారి’, మన్మోహన్ ‘మౌనం’, పుస్తకంలో ఏకిపారేసిన రాజా!

By Ramesh Babu
|

న్యూఢిల్లీ: టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు ఎ.రాజా త్వరలోనే విడుదలకానున్న తన పుస్తకం '2జీ సాగా అన్‌ఫోల్డ్స్'లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్‌లను ఏకిపారేశారు.

విడుదలకు ముందే ఈ పుస్తకం కాపీని సీఎన్ఎన్-న్యూస్ 18 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ భూపేంద్ర చౌబే సంపాదించారు. తాను టెలికాం పాలసీని ఆమోదించిన తరువాత కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ పలుమార్లు తన సలహాదారుల ద్వారా తప్పుడు సమాచారం అందించి తనను తప్పుదోవ పట్టించారని రాజా ఆరోపించారు.

నిష్క్రియాత్మక పరిశీలకుడిగా మన్మోహన్...

నిష్క్రియాత్మక పరిశీలకుడిగా మన్మోహన్...

2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై రాసిన పుస్తకం ‘2జీ సాగా అన్‌ఫోల్డ్స్'లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాగ్ వినోద్ రాయ్‌లను టెలికాం మాజీ మంత్రి రాజా ఏకిపారేశారు. ప్రధాని మన్మోహన్ సూచనల మేరకే తాను 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపినప్పటికీ.. అందులో తనకెలాంటి సంబంధం లేనట్లు ఆయన వ్యవహరించారని, 2జీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేసినప్పుడు, 15 నెలలపాటు తాను జైలుశిక్ష అనుభవించినప్పుడు కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ నిష్క్రియాత్మక పరిశీలకుడిగా ఉండిపోయారనిరాజా తన పుస్తకంలో దుయ్యబట్టారు.
ఏం జరుగుతున్నా మన్మోహన్ సింగ్ మౌనంగా చూస్తూ ఉండిపోయారని, ప్రధానమంత్రి కార్యాలయంపై టెలికాం కంపెనీల లాబీయింగ్ ప్రభావం ముమ్మాటికీ ఉందని రాజా ఆరోపించారు.

 కాగ్ వినోద్ రాయ్ సూత్రధారి ...

కాగ్ వినోద్ రాయ్ సూత్రధారి ...

ఇక కాగ్ వినోద్‌రాయ్ అయితే ‘పిల్లి కళ్లుమూసుకుని.. లోకమంతా చీకటిగా ఉందన్నట్లు'గా ప్రవర్తించారని రాజా తన పుస్తకంలో తీవ్రంగా విమర్శించారు. ఇదంతా యూపీఏ ప్రభుత్వాన్ని పడదోయడానికి కాగ్ వినోద్ రాయ్ వేసిన రాజకీయ ఎత్తుగడలా అనిపిస్తోందని, వినోద్ రాయ్ తొందరపడి ఏ ఆధారాలూ లేకుండానే తన నివేదికలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం గురించి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసలు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి కాగ్ వినోద్ రాయ్ ‘సూత్రధారి' అని, ఆయన సమర్పించిన నివేదిక ఎందుకూ పనికిరాని చెత్త అని రాజా తన పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఒక సాక్షిగా ఉన్న వినోద్ రాయ్ ఆరోపణలు క్రాస్ ఎగ్జామినేషన్‌లో నిలబడలేకపోయాయని వ్యాఖ్యానించారు.

సీబీఐ దాడులూ ప్రధానికి తెలియవా?

సీబీఐ దాడులూ ప్రధానికి తెలియవా?

విచిత్రం ఏమిటంటే.. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుపై సీబీఐ దాడులకు సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎలాంటి సమాచారం లేదని కూడా రాజా తన పుస్తకంలో తెలిపారు. ‘అక్టోబర్ 22, 2009 న (టెలికాం మంత్రిత్వ శాఖ మరియు కొంతమంది టెలికాం ఆపరేటర్ల కార్యాలయాలపై సిబిఐని తనిఖీల అనంతరం) నేను సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఉదయం 7.00 గంటలకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశాను. ఆ సమయంలో అక్కడ పీఎంఓ ప్రధాన కార్యదర్శి టీకేఏ నాయర్ కూడా ఉన్నారు. నేను సిబిఐ దాడుల గురించి చెప్పినప్పుడు ప్రధాని ఆశ్చర్యపోయారు..' అని రాజా తన పుస్తకంలో రాశారు.

పీఎంఓ నుంచి ఉత్తరం...

పీఎంఓ నుంచి ఉత్తరం...

‘యూపీఏ-2 ప్రభుత్వంలో టెలికాం మంత్రిగా ఉన్న నేను స్పెక్ట్రమ్ వేలం విధానాన్ని రూపొందించడానికి ఎంతో పోరాడవలసి వచ్చింది. వేలం విధానం చివరి దశలో ఉండగా.. ఓ రోజు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఓ ఉత్తరం వచ్చింది.. అందులో విషయం అప్పటికే లాబీయింగ్ జరుపుతున్న టెలికాం కంపెనీలకే అనుకూలంగా ఉంది..' అని రాజా తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఇదే.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి.. సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సంతకంతో కూడిన అలాంటి లేఖను నేను ఊహించలేదు. ఆ లేఖలో ఉపయోగించిన పదజాలం నాకెంతో బాధ కలిగించింది..' అని రాజా తెలిపారు.

ఏమీ తెలియదనడం అసత్యం...

ఏమీ తెలియదనడం అసత్యం...

తాను వివిధ సమావేశాలలో ప్రధాని మన్మోహన్ సింగ్‌‌ను ఎన్నోమార్లు కలిసేవాడినని, ఒకసారి అయితే ప్రధాని తన సీటులోంచి లేచి వచ్చి మరీ తన పక్కనే కూర్చుని తనను అడిగారని, ప్రధాని కార్యాలయం కూడా టెలికాం విధానంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండేదని, మన్మోహన్ సింగ్‌‌కు ఏమీ తెలియదనడం, లేదంటే ఆయన్ని తప్పుదోవ పట్టించారనడం అసత్య ఆరోపణలని రాజా వెల్లడించారు. అన్నిటికన్నా దురద‌ృష్టం ఏమిటంటే.. చీఫ్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, పార్లమెంట్ సంయుక్త కమిటీ, సుప్రీంకోర్టు.. తన వాదనను వినేందుకు అప్పట్లో నిరాకరించాయని, కనీసం ప్రధాని మన్మోహన్ సింగ్‌, ఆర్థికమంత్రి చిదంబరం తనకు ఏ విధంగానూ మద్దతు ఇవ్వలేదని, వారి మౌనం యావత్తు దేశ మౌనంగా తనకు అనిపించిందని రాజా తన పుస్తకంలో ధ్వజమెత్తారు.

  2G spectrum scam : 2జీ స్కాం: డీఎంకే సంబరాలు, వీడియో !
  రాజీనామా పత్రం అందించాను...

  రాజీనామా పత్రం అందించాను...

  ‘నవంబరు 14, 2009న నేను చెన్నై నుంచి ఢిల్లీకి రాగానే ఉదయం 9 గంటల సమయంలో టీఆర్ బాలు నన్ను కలిసి అధిష్ఠానం తనను రాజీనామా చేయాల్సిందిగా సూచించినట్లు చెప్పారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని నా అధికారిక నివాసానికి వెళుతూ నేను ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాను. అప్పటికే నేను నా పీఏని పిలిచి నా రాజీనామా సిద్ధం చేయమని చెప్పాను. దాన్ని తీసుకునే ప్రధాని మన్మోహన్ ‌సింగ్‌ నివాసానికి వెళ్లాను. అప్పటికే ప్రధాని మోహం విచారంగా ఉంది. ఆయన నాకు టీ ఆఫర్ చేయగా నేను నా రాజీనామా పత్రాన్ని ఆయనకు అందించాను...' అని రాజా పేర్కొన్నారు.

  మన్మోహన్ సింగ్ భయపడ్డారు...

  మన్మోహన్ సింగ్ భయపడ్డారు...

  ‘మొత్తం పరిస్థితి గురించి ప్రధాని మన్మోహన్ సింగ్ విచారంగా మాట్లాడారు. స్పెక్ట్రమ్ కేటాయింపులో అవకతవకలపై కాగ్ నివేదిక, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, కుంభకోణంలో ఆయన హస్తం కూడా ఉందంటూ వచ్చిన వార్తా కథనాలు.. అన్నీ కలిసి ప్రధానిని ఒకరకమైన భయాందోళనకు గురిచేసినట్లు తేటతెల్లం అవుతోంది. నేను స్పష్టంగా, దృఢంగానే ఉన్నా స్పెక్ట్రమ్ కేటాయింపులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయనే అభిప్రాయం నుండి ఆయన్ని మాత్రం బయటికి తీసుకురాలేకపోయాను..' అని టెలికాం మాజీ మంత్రి రాజా త్వరలో విడుదల కానున్న తన పుస్తకం ‘2జీ సాగా అన్‌ఫోల్డ్స్'లో వివరించారు.

  English summary
  In a tell-all book likely to be released within a month of his acquittal in the 2G spectrum cam case, former telecom minister A Raja has taken to task former Prime Minister Manmohan Singh and the then Comptroller & Auditor General Vinod Rai. In his book 2G Saga Unfolds, a copy of which was accessed by CNN-News18’s Executive Editor Bhupendra Chaubey, Raja claims that Manmohan Singh was repeatedly misinformed by his advisors and despite approving Raja’s telecom policy, chose to remain a passive observer even when the DMK leader was arrested and jailed for 15 months.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X