వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

citizenship bill: కాంగ్రెస్‌కు షాక్: శివసేన యూటర్న్, రాజ్యసభలో?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీకి శివసేన షాకిచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ బిల్లుపై మొన్నటి వరకు విమర్శలు చేసిన శిసేన.. లోక్‌సభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఆ బిల్లుకు మద్దతుగా ఓటు వేయడం గమనార్హం.

citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదంcitizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదం

సంజయ్ రౌత్ మరో ట్విస్ట్..

సంజయ్ రౌత్ మరో ట్విస్ట్..


దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము పౌరసత్వ సవరణ బిల్లుకు మద్తగా ఓటు వేశామని శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అయితే, బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే ఈ బిల్లుకు తమ మద్దతు విషయంలో తమ వైఖరి భిన్నంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా యూపీఏలో చేరలేదు..

ఇంకా యూపీఏలో చేరలేదు..


మరో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కోసం ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన తెలిపారు. తాము ఇంకా యూపీఏలో సభ్యులం కాదని చెప్పారు. ఒక వేళ యూపీఏలో చేరినా ప్రజల కోసమే పనిచేస్తామని తెలిపారు.

ఎన్డీఏలో ఉన్నా అంతే..

ఎన్డీఏలో ఉన్నా అంతే..


దేశానికి మంచి అనుకుంటే తాము మద్దతుగా నిలుస్తామని ఎంపీ అరవింద్ సావంత్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా తమ స్టాండ్ ఇదేనని ఆయన అన్నారు.
తాము శివసేనతో 25 ఏళ్లుగా కూటమిగా ఉన్నామని అమిత్ షా చెబుతున్నారని, మెహబూబా ముఫ్తీ పార్టీతో పొత్తు పెట్టుకుని వారిని కూడా ఒంటరిగా వదిలేశారని ఎంపీ మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ నేతలంతా విమర్శలు చేస్తున్నారు.

ఎంపీలకు విప్‌లు.. శివసేన ఏం చేస్తుందో..

ఎంపీలకు విప్‌లు.. శివసేన ఏం చేస్తుందో..


సోమవారం లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించిందిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు పలికింది. బుధవారం రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎంపీలకు సభకు హాజరుకావాలంటూ విప్ జారీ చేశాయి. మరి రాజ్యసభలో శివసేన బిల్లుకు మద్దతు పలుకుందా? లేదా? అనేది ఇప్పుడు ఉత్కంటగా మారింది.

English summary
the Shiv Sena voted with the government on the contentious Citizenship (Amendment) Bill yesterday in the Lok Sabha, despite a breakdown in ties that began soon after the Maharashtra election and led to the formation of the Shiv Sena-Congress-NCP adminstration there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X