వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్ పై ఆంక్షల ఎఫెక్ట్ : భారత్‌కు అదనంగా ఆయిల్ సప్లై చేయనున్న సౌదీ అరేబియా

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎగుమతి దేశంగా నిలిచిన సౌదీ అరేబియా భారత్‌లోని ఆయిల్ కొనుగోలు కంపెనీలకు అదనంగా 4 మిలియన్ బ్యారెల్ల ముడచమురును సప్లై చేయనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ నుంచి సప్లై చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆయిల్ దిగుమతులపై ఇరాన్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఏదైతే భారత్‌కు ఆయిల్ సప్లై తక్కువ పడుతుందో ఆ నష్టాన్ని సౌదీ తీర్చనున్నట్లు ప్రకించింది.

చైనా తర్వాత భారత్‌కు ఆయిల్ ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు ఇరాన్‌ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఆపివేశాయి. ఇరాన్‌కు క్లయింట్లుగా ఉన్న చాలా దేశాలు తమ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, మంగళూరు రిఫైనరీ ప్రెట్రో కెమికల్స్ లిమిటెడ్ సంస్థలు నవంబర్ నెల నుంచి సౌదీ అరేబియా నుంచి అదనంగా ఒక మిలియన్ బ్యారెల్ ముడిచమురు పొందనున్నట్లు సమాచారం.

In the wake of sanctons, Saudi to supply extra oil to India

ఇరాన్ పై ఆంక్షలు విధించడంతో ముడిచమురు కోసం ఆదేశంపై ఆధారపడ్డ భారత ఆయిల్ కంపెనీలు చాలా నష్టపోతున్నాయి. ఇప్పటికే ఇరాన్ నుంచి 9 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ కొనుగోలుకు భారత కంపెనీలు ఆర్డర్ ఇచ్చాయి . తాజాగా అమెరికా ఆంక్షల చట్రంలో ఇరాన్ ఇరుక్కోవడంతో భారత్‌ను ఆదుకునేందుకు సౌదీ అరేబియా ముందుకొచ్చింది.

English summary
Saudi Arabia, the world’s biggest oil exporter, will supply Indian oil buyers with an additional 4 million barrels of crude oil in November, several sources familiar with the matter said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X