వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: ఆ గ్రామంలో ఇద్దరు భార్యలే ముద్దు, ఒకే ఇంట్లో కాపురం

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: సంప్రదాయం పేరుతో ఒక్కో వ్యక్తి రెండు వివాహలు చేసుకొని సుఖ, సంతోషాలతో కాపురం చేసుకొంటున్నారు. సుమారు 946 మంది జనాభా ఉన్న రాంధీయోకి లో ఏళ్ళ తరబడి చాలామంది ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార వ్యవహరాలు, సాంప్రదాయాలు ఉంటాయి.కొన్ని గ్రామాల్లో కొన్ని పద్దతులను కొనసాగిస్తుంటారు. కారణాలు తెలియకపోయినా పూర్వ కాలం నుండి కొనసాగుతున్నాయనే కారణంగా వాటిని కొనసాగిస్తున్న సందర్భాలు కూడ లేకపోలేదు.

రాజస్థాన్ రాష్ట్రంలోని రాందీయోకి బస్తీ అనే గ్రామంలో ఎక్కువ మంది ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్నారు. అయితే ఇద్దరు భార్యలు కూడ ఒకే ఇంట్లో భర్తతో కాపురం చేయడం గమనార్హం.

ఆ గ్రామంలో అందరికీ ఇద్దరు భార్యలు

ఆ గ్రామంలో అందరికీ ఇద్దరు భార్యలు

రాజస్థాన్ రాష్ట్రంలోనిరాందీయోకి బస్తీ అనే గ్రామానికి వెళ్తే ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఈ గ్రామంలో ప్రతి రెండిళ్ళలో ఒకరికి రెండు పెళ్ళిళ్ళు చేసుకొన్నారు. అంతేకాదు ఇద్దరు భార్యలతో కలిసి సుఖంగా కాపురం చేస్తున్నారు. భార్య, భర్తల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని వారు చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరు భార్యలతో భర్త ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

రెండో భార్యకు కొడుకు పుడతాడని విశ్వాసం

రెండో భార్యకు కొడుకు పుడతాడని విశ్వాసం

రాందీయోకి బస్తీ గ్రామంలో ఎక్కువ మంది రెండు పెళ్ళిళ్ళు చేసుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు స్థానికులు. కొడుకు కోసం రెండో పెళ్ళి చేసుకొంటున్నారని తేలింది. మొదటి భార్యకు ఆడపిల్లలు పుడితే రెండో భార్యను వివాహం చేసుకొంటారు. రెండో భార్యకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడని ఈ గ్రామస్తుల నమ్మకం. ఈ నమ్మకం వల్లే వారంతా ఇద్దరు భార్యలను వివాహం చేసుకొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

 అక్క వెయ్యిలోపే జనాభా

అక్క వెయ్యిలోపే జనాభా


రాంధీయోకి బస్తీ గ్రామ జనాభా విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా సుమారు 946 మంది జనాభా ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కలు తీసిన ఇప్పటికి 7 ఏళ్ళు దాటుతున్న తరుణంలో కొంత జనాభాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం లేకపోలేదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు భార్యలను చేసుకోవడం వల్ల కూడ ఈ గ్రామ జనాభా వెయ్యికి సమీపంలోకి వచ్చిందని సరదాగా చెప్పేవారు కూడ లేకపోలేదు.

ఇద్దరు భార్యలతో సంసారం

ఇద్దరు భార్యలతో సంసారం

రాందీయోకి బస్తీ గ్రామంలో ఇధ్దరు భార్యలతో ఎక్కువ మంది కాపురాలు చేస్తున్నా కానీ, ఎటువంటి గొడవలు వారి మధ్య లేవు. అయితే ఏ ఒక్క ఇంట్లో కూడ సవతుల పోరు లేకుండా ఉండడం గమనార్హం. ఇద్దరు భార్యలు, పిల్లలతో కలిసి భర్త ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. పెళ్ళై మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యను వివాహం చేసుకోవడం నేరం. కానీ, ఈ గ్రామంలో మాత్రం ఎవరూ కూడ కేసులు, కోర్టులంటూ వెళ్ళకపోవడం కూడ ఆశ్చర్యం కలిగిస్తోంది.

English summary
Several men of Ramdeyo-Ki-Basti in Jaisalmer claim to be happily married twice over, thanks to their tradition of having two wives. Ramdeyo-Ki-Basti is a small village with a total population of 946 (2011 Census), in Derasar gram panchayat in the desert district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X