• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్వచ్ఛభారత్‌లో లోపించిన దేశభక్తి : గాంధీ, జాతీయ చిహ్నాం ప్రతిమతో టాయిలెట్‌లో టైల్స్‌

|

బులంద్‌సహర్ : స్వచ్చ భారత్ అంటే శుచిగా, శుభ్రంగా ఉండటం, పరిసరాలను ఉంచుకోవడం. ముఖ్యంగా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ఇంతవరకు ఓకే .. కానీ యూపీలో స్వచ్చ భారత్ బెడిసికొట్టింది. మరుగుదొడ్ల నిర్మాణం ఓకే కానీ .. అందులో టైల్స్ వేశారు. ఇదీ ఓకే కానీ ఆ టైల్స్ మీద ఉన్న ప్రతీమే మన జాతికి అవమానం కలిగించేట్టు ఉంది.

బులంద్‌సహర్‌లో ఘటన ..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్ సహర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం అధికారులు శ్రమిస్తున్నారు. ప్రజలను ఒప్పించి టాయిలెట్స్ కట్టిస్తున్నారు. కానీ ఇచ్చావరి గ్రామంలో ఓ టాయిలెట్ వద్ద కనిపించిన దృశ్యం ఆశ్చర్యపరిచింది. ఆ టాయిలెట్ నిర్మాణంలో ఉంది. టైల్స్ వేశారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే తెలిసింది. వాటిమీద మన జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో కనిపించింది.

ఇదేంటి మహాత్ముడి ప్రతీమ ఉన్న టైల్స్ టాయిలెట్‌లో వేయడం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతోపాటు మన జాతీయ చిహ్నం ప్రతీమ కూడా ఉంది. జాతిపితతోపాటు మన జాతీయ చిహ్నం ఫోటో టాయిలెట్ టైల్స్‌పై ఉండటం ఏంటి అని సగటు భారతీయుడు ప్రశ్నిస్తున్నారు. వారి ఫోటోలతో ముద్రించిన టైల్స్‌ను ఇంట్లో .. లేదంటే దేవుడి గదిలో పెట్టుకోవాలే తప్ప మరీ టాయిలెట్లో వేయడం ఏంటి అని మండిపడుతున్నారు. ఓ నెటిజన్ తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

in toilet tiles gandhi, national emblem photo .. viral

పట్టం కడితే .. చేసేది ఇదా ?

ఇటీవల యూపీలో బీజేపీకి ప్రజలు మంచి సీట్లతో పట్టం కట్టారు. కానీ కొన్ని రోజులకే ఇలాంటి వీడియో రావడం ఆ పార్టీని ఇరుకున పెట్టినట్టవుతోంది. దీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆత్మరక్షణ ధోరణిలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియోపై విపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే దీనిపై బీజేపీ తప్పించుకోలేని సిచుయేషన్ ఉంది. ఒకవేళ ఒకరిద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి .. మెల్లగా జారుకునే అవకాశాలు లేకపోలేదనే వాదన కూడా ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tiles with images of Mahatma Gandhi & the national emblem found plastered on the walls of the toilets made under Swachh Bharat Mission in Bulandshahr's Ichhawari village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more