వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆ 9మంది ఓటేయొద్దు': జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం ఝలక్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీశ్ రావత్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నెల 10న విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు స్పీకర్ అనర్హత వేటు వేసిన 9 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోజు విశ్వాసపరీక్షలో ఓటు వేయడానికి అనర్హులని కూడా కోర్టు స్పష్టం చేసింది.

హరీశ్ రావత్ ఎదుర్కొనే విశ్వాసపరీక్ష సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరగుతుందని పేర్కొంది. విశ్వాస పరీక్షను ఈ నెల 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని, ఆ సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు జరగదని పేర్కొంది.

ఆరోజు ఒక పరిశీలకుడిని నియమిస్తామని, మొత్తం సభా కార్యకలాపాలు అన్నింటినీ వీడియో తీయిస్తామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. విశ్వాస పరీక్ష నిర్వహించడానికి కేంద్రం అంగీకరించడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విశ్వాస పరీక్షలో రావత్ నెగ్గితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడనుంది.

In Uttarakhand, No President's Rule For 2 Hours For Harish Rawat's Vote

మొత్తం 70 మంది శాసనసభ్యులన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తన మెజారిటీని నిరూపించుకుంటుందని హరీష్ రావత్ ధీమా వ్యక్తం చేశారు. అనర్హత వేటు పడిన 9 మంది ఎమ్మెల్యేలను సుప్రీం కోర్టు అనర్హులుగా ప్రకటించడంతో 61మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనున్నారు.

కాగా, బీజేపీ మాత్రం హరీశ్ రావత్ ప్రభుత్వం మైనారిటీలోనే ఉందని ఇప్పటికీ వాదిస్తోంది. ఏప్రిల్ 18న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపై ఓటింగులో 9 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నేపథ్యంలో స్పీకర్ వారిపై అనర్హత ఓటు వేశారు. ఆ తర్వాత ఆ 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని కూలదోశారు.

దీంతో రంగంలోకి దిగిన రానత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మళ్లీ తన గూటికి తెచ్చుకోడానికి వాళ్లకు లంచం ఇవ్వజూపుతూ హరీష్ రావత్ వీడియోలో చిక్కారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని కూడా ఆయన ఒప్పుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

అయితే అసెంబ్లీలో మొన్నటిదాకా కాంగ్రెస్ సభ్యులుగానే ఉండి తాజాగా బీజేపీలో చేరిన 9 మంది ఎమ్మెల్యేలకు విశ్వాసపరీక్షలో ఓటు హక్కు లేకుండా చేయడం బీజేపీకి కూడా మొట్టికాయేనని చెప్పొచ్చు. ఈ తీర్పు భవిష్యత్తులో ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరికగానే మారుతుందనే వాదన వినిపిస్తోంది.

దీంతో ఈనెల 10వ తేదీన విశ్వాస పరీక్ష జరగనుండటం, అందులో రెబెల్ ఎమ్మెల్యేలకు ఓటుహక్కు లేకపోవడంతో రావత్ నేతృత్వంలోని ప్రభుత్వం గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

English summary
Harish Rawat of the Congress will get a chance to prove he has a majority in the Uttarakhand assembly through a vote of confidence on Tuesday, May 10, the Supreme Court has ruled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X