వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలపై ఈయూ ప్రెసిడెంట్‌కు స్పీకర్ లేఖ, జోక్యం సరికాదని కామెంట్

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరొపియన్ పార్లమెంట్ ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన యూరొపియన్ యూనియన్ పార్లమెంట్ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. సీఏఏకు వ్యతిరేకంగా యూరొపియన్ పార్లమెంట్‌లో ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లో మొత్తం 751 మంది సభ్యులు ఉంటే 600 మంది సభ్యులు తీర్మానాలకు అనుకూలంగా ఉన్నారు.

తీర్మానాలు సరికాదు..

తీర్మానాలు సరికాదు..

సీఏఏతో ప్రపంచంలో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని కూడా పేర్కొన్నారు. అంతేకాదు ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా లేఖ రాశారు. ‘ప్రజాస్వామ్యంలో ఒకదేశం చేసిన చట్టంపై మరో దేశం తీర్మానం చేయడం సరికాదు. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప, శ్రేయస్సు కోసం కాదన్నారు. క్యాబ్ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందిందన్నారు. మతపరమైన హింస ఎదుర్కొన్న వారికి ఈజీగా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంటుందే తప్ప.. ఒకరి నుంచి పౌరసత్వం తీసివేసేందుకు కాదు' అని ఈయూ అధ్యక్షుడికి రాసిన లేఖలో స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.

ఇదీ సంగతి

ఇదీ సంగతి

అయితే డెమోక్రటిక్ ఇండెక్స్‌లో ఇండియా స్థానం 10వ స్థానానికి పడిపోయిన క్రమంలో ఈయూ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు జమ్మకశ్మీర్‌లో కూడా గత ఐదు నెలలుగా ఆంక్షలు కొనసాగుతూనే న్నాయి. యూరొపియన్ పార్లమెంట్‌లో ఆరు తీర్మానాలు వచ్చే వారం చర్చకొచ్చే అవకాశముంది. మార్చిలో ప్రధాని మోడీ ఇండియా-యూరొపియన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఈయూ పార్లమెంట్‌లో సీఏఏపై తీర్మానాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు యూరొపియన్ పార్లమెంట్‌లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఖండించింది.

ఆరు తీర్మానాలు

ఆరు తీర్మానాలు


పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూరోపియన్ పార్లమెంట్ ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టబోతోంది. రెండు తీర్మానాలో సీఏఏ భయంకరమైన విభజన అని పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని భావిస్తోంది. యూరొపియన్ పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చ జరుపుతారు.
యూరొపియన్ పార్లమెంట్‌లో సెంటర్ రైట్ యూరొపియన్ పీపుల్స పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో పార్టీకి 182 మంది ఎంపీలు ఉన్నారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే చట్టం చేశారని ఆరోపించింది.

English summary
Lok Sabha speaker Om Birla has written to the President of the European Union parliament a day after 600 of its 751 Parliament members moved six resolutions on the caa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X