వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌కు మరోసారి ఎదురుదెబ్బ.. తిరగబడిన మరో కేసు...

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్‌ వాణిజ్య సంస్థ కాదు అని రాహుల్ గాంధీ పేర్కొనడం అతనిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అది వాణిజ్య సంస్థ అని ఇన్‌కామ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఆదాయపు పన్ను రూ.100 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీపై కేసు తిరిగి విచారిస్తామని స్పష్టంచేసింది.

చారిటబుల్ ట్రస్ట్‌ నగదు గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 10న వారు కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు 2011-2012లో ఆదాయపు పన్ను, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కేసులో కూడా కోర్టును వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులకు సంబంధించి ఇన్‌కాం ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని రాహుల్ గాంధీకి.. సుప్రీంకోర్టు సూచించింది. దీంతో రాహుల్ గాంధీ యంగ్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ వాణిజ్య సంస్థ కాదు అని పేర్కొన్నారు. దానిని అప్పిలేట్ ట్రైబ్యునల్ తోసిపుచ్చింది.

Income Tax Appellate Tribunal dismisses Rahul Gandhi application

నేషనల్ హెరాల్డ్ కేసుతోపాటు చారిటబుల్ ట్రస్ట్ పన్నులపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ అండ్ కో పై విచారణ ఆదాయపు పన్ను శాఖ నుంచి సుప్రీంకోర్టు వరకు జరుగుతున్నాయి. ఈ కేసులో రాహుల్ గాంధీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

English summary
Income Tax Appellate Tribunal on Friday dismissed Congress leader Rahul Gandhi's plea to make Young India a charitable trust, calling it a commercial organisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X