వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమార్కులపై వేట ప్రారంభించిన ఆదాయపు పన్ను శాఖ

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఆయా బ్యాంకుల్లో ఏ మేరకు నగదు జమ అయింది, నల్ల ధనం మార్పిడి కోసం ఎవరెవరు ఏ రకంగా వ్యవహరించారనే విషయమై పరిశీలినచేస్తున్నామని ఆదాయపు పన్నుశాఖాధికారులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఆయా బ్యాంకు ఖాతాల్లోకి వెల్లువెత్తిన ఆదాయాలపై ఆదాయపు పన్నుశాఖ కేంద్రీకరించింది.ఏఏ ఖాతాల్లో ఎక్కువ నిధులు జమచేశారనే విషయాన్ని ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.

పరిమితికి మించి లావాదేవీలు జరిగిన అనుమానాస్పద ఖాతాలపై కూడ ఆదాయపు పన్నుశాఖాధికారులు పరిశీలనచేస్తున్నారు. డిల్లీలోని వ్యాపార సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లు, నిపుణులతో సమావేశమైన ఐటిశాఖ కమీషనర్ ఎకె చౌహన్ నల్లధనం మార్పిడి కోసం అక్రమార్కులు ఏ రకంగా వ్యవహరించారనే దానిపై చర్చించారు.

income tax department begins process of analysing after demonetasion

దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు అకౌంట్లలో లెక్కలు చూపని ధనాన్ని జమ చేసిన విషయాన్ని గుర్తించారు. ఈ పద్దతిలో లెక్కలు చూపని ధనాన్ని పలు ఖాతాల్లో జమ చేసిన వారు ప్రధానమంత్రి కళ్యాణ్ యోజన పథకం కింద పన్ను చెల్లించాలని ఆధాయపు పన్నుశాఖ కోరింది.లేకపోతే గడువు ముగిశాక విచారణలో నల్లధన కుభేరులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరికలు జారీచేసింది.

బ్యాంకు డిపాజిట్లను, అకౌంట్లను, పరిశీస్తున్నట్టు ఆదాయపు పన్నుశాఖాధికారులు చెబుతు్ననారు. పిఎంజికెవై పథకాన్ని వినియోగించుకోవాలనుకొనేవారు నిశ్చింతగా ఉండకూదనన్నారు. ఆర్థిక ఇంటలిజెన్స్ యూనిట్ , ఇతర సంస్థలు ఇచ్చే వివరాలను విశ్లేషిస్తున్నట్టు ఆయన చెప్పారు.

పిఎంజికెవై పథకం కింద పన్ను చెల్లించాలని ఆయన కోరారు.అయితే పన్ను ఎగవేత దారులకు కష్టాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆదాయ వెల్లడి పథకం కాదని నల్లధనం నుండి బయటకు వచ్చేందుకు చివరి అవకాశమన్నారు అధికారులు.

English summary
income tax department begins process of analysing after demonetasion.we are in the process of examing deposits, in banks said income tax officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X