వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి, మాజీ సీఎం, మంత్రులు మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఐటీ శాఖ, అంతే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మా విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

<strong>కాంగ్రెస్ రెబల్స్: సిద్దూకు లొంగని నేతలు, రాహుల్ గాంధీ ఎంట్రీ, సీఎం కొడుకుకు షాక్, ఏం చేస్తారు!</strong>కాంగ్రెస్ రెబల్స్: సిద్దూకు లొంగని నేతలు, రాహుల్ గాంధీ ఎంట్రీ, సీఎం కొడుకుకు షాక్, ఏం చేస్తారు!

కొంత కాలం క్రితం కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ శాఖ దాడులు చేసిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, మంత్రి డీకే. శివకుమార్ తదితరులు ఐటీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

Income tax department complaint against coalition top leaders to election commission in Karnataka

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో మా విధులకు ఆటంకం కలిగిందని ఆదాయపన్ను శాఖ అధికారులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్చి 28వ తేదీన మంత్రి పుట్టరంగశెట్టితో సహ పలువురు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

<strong>సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!</strong>సినిమా: నాడు హెలికాప్టర్, నేడు ఎద్దుల బండిలో నామినేషన్, చిల్లర సంచి, స్టూడెంట్ లీడర్!

అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రితో సహ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరు నగరంలోని క్వీన్స్ రోడ్డు సమీపంలోని ఐటీ శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఐటీ శాఖ దాడులు చేసిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, మంత్రులు డీకే. శివకుమార్, ఆర్. మహేష్, రామలింగా రెడ్డి తదితర రాజకీయ పార్టీ నాయకులు మా విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలలో ఆదాయపన్ను శాఖ చులకన అయ్మే విదంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఐటీ శాఖ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

English summary
Income tax department complaint against coalition top leaders to election commission. IT says Kumaraswamy, Siddaramaiah, DK Shivakumar and many other leader disrupted to their duty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X