వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4,172 కోల్ల లెక్కతేలని నగదు స్వాధీనం,అక్రమార్కులపై సిబిఐ కేసులు

దేశవ్యాప్తంగా ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో సుమారు 4,172 కోట్ల లెక్కతేలని ఆదాయాన్ని స్వాధీనం చేసుకొంది.అయితే ఇందులో 105 కోట్లు కొత్త కరెన్సీ ఉంది.అక్రమాలకు పాల్పడిన వారిపై సిబిఐ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్టు రద్దుచేసిన తర్వాతే దేశవ్యాప్తంగా సుమారు 4,172 కోట్లను లెక్కతేలని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇందులో 105 కోట్లు కొత్త కరెన్సీ నోట్లున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై సిబిఐ , ఈడీ కేసులను నమోదుచేసింది.

పెద్ద నగదునోట్లను రద్దుచేసిన తర్వాత నల్ల ధనాన్ని మార్పిడి చేసుకొనేందుకు అక్రమార్కులు అనేక మార్గాలను అన్వేషించారు. అయినా ఆదాయపు పన్నుశాఖాధికారులు లెక్కతేలని నగదును స్వాధీనం చేసుకొన్నారు.

దేశవ్యాప్తంగా నవంబర్ 8వ, తేది తర్వాత ఏ ఖాతాల్లో ఎక్కువ నగదు జమ అయింది, ఎక్కడి నుండి నగదు వచ్చింది ఏ కాతాలో జమ అయిందనే విషయాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు.

ఆదాయపు పన్నుశాఖాదికాలు బ్యాంకుల ఖాతాలతో పాటు అన్ని రకాల కొనుగోళ్ళపై కూడ ఓ కన్నేసి ఉంచారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించేందుకు సిద్దమయ్యారు. యాభై రోజులు పూర్తైంది. ఇంకా నల్లధనం కలిగి ఉన్నవారికి ఆదాయపు పన్నుశాఖ జరిమానాలను వడ్డించనుంది.

 ఆదాయపు పన్నుశాఖ దాడులు

ఆదాయపు పన్నుశాఖ దాడులు

దేశ వ్యాప్తంగా 983 చోట్ల ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4,172 కోట్ల లెక్కతేలని ఆదాయాన్ని స్వాధీనం చేసుకొన్నారు. బ్యాంకుల ఖాతాలతో పాటు ఇతరత్రా వ్యవహరాలపై నిఘాను ఏర్పాటుచేసి ఆదాయపు పన్నుశాఖాధికారులు నిర్వహించిన సోదాల్లో ఈ నగదును దొరికింది. ఈ నగదులో 105 కోట్ల కొత్త కరెన్సీ ఉంది..అయితే ఇంకా దాడులను నిర్వహించేందుకుమ ఆదాయపు పన్నుశాఖాధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు.

నోటీసులిచ్చిన ఆదాయపు పన్నుశాఖ

నోటీసులిచ్చిన ఆదాయపు పన్నుశాఖ

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత సుమారు 5,027 మందికి నోటీసులను ఇచ్చింది ఆధాయపు పన్నుశాఖాధికారులు.అయితే పన్ను ఎగవేసేందుకు ప్రయత్నించేవారు అనుసరించే మార్గాలపై కూడ ఐటిశాఖ కన్నేసింది. నల్లధనం మార్పిడి కోసం అక్రమార్కులు అనుసరించే మార్గాలపై కూడ నిఘాను ఉంచింది.దీంతో అక్రమార్కులు ఇబ్బందులు తప్పడం లేదు.

భారీగా బంగారం స్వాధీనం

భారీగా బంగారం స్వాధీనం

ఆదాయపు పన్నుశాఖాధికారులు నగదే కాకుండా భారీగా బంగారాన్ని కూడ స్వాధీనం చేసుకొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో 549 కోట్ల విలువైన బంగారాన్ని కూడ స్వాధీనం చేసుకొన్నారు. మరో వైపు సామాన్యులు కొత్త కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతోంటే ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు నిర్వహించిన అక్రమార్కుల ఇళ్ళలో మాత్రం కొత్త కరెన్సీ దొరికింది,. కొత్త రెండువేల రూపాయాల నోట్ల కట్టలు అక్రమార్కుల ఇళ్ళలో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకొన్నారు. కొత్త కరెన్సీ 105 కోట్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా అధికారులు లెక్కలు తేల్చారు.

లెక్కతేలని ఆదాయం ఉన్నవారిపై కేసులు

లెక్కతేలని ఆదాయం ఉన్నవారిపై కేసులు

పెద్ద నగదునోట్లు రద్దు చేసిన నాటినుండి డిసెంబర్ 28వ, తేది వరకు 4,172 కోట్లను స్వాధీనం చేస.కొన్నారు.అయితే అక్రమార్కులపై ఆదాయపు పన్నుశాఖాధికారులు కేసులు పెట్టారు.477 కేసులను సిబిఐకి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కు బదిలీ చేసింది. నల్లధనం కలిగి ఉంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో జమ చేసిన కొంత మేరకు ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

English summary
ove rs4,172 crore of undisclosed income has been detected while new notes worth rs 105 crore have been seized by the income tax department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X