వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధికకు కొత్త చిక్కులు: రూ. 7కోట్లు పంచారు, శరత్ కుమార్, మంత్రి వాట్సప్ మెసేజ్‌లే కీలకం

ప్రముఖ సినీ నటి రాధిక మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆమెకు చెందిన రాడాన్ టీవీ నుంచి ఉప ఎన్నికలు జరగనున్న ఆర్కే నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 7కోట్లు పంచేశారంటూ ఆమె భర్త శరత్ కుమార్‌పై వస్తున్న ఆరోపణల .

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ సినీ నటి రాధిక మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆమెకు చెందిన రాడాన్ టీవీ నుంచి ఉప ఎన్నికలు జరగనున్న ఆర్కే నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 7కోట్లు పంచేశారంటూ ఆమె భర్త శరత్ కుమార్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రాడాన్ టీవీ కార్యాలయంలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు.. ఈ రూ.7కోట్లు వ్యవహారాన్ని గుర్తించినట్లు సమాచారం.

రాధికా, శరత్ కుమార్‌లకు మరోసారి సమన్లు జారీ చేసిన ఐటీ అధికారులు బుధవారం మధ్యాహ్నం 3గంటలకు హాజరుకావాలని ఆదేశించారు.

ఓటుకు రూ.4వేలు

ఓటుకు రూ.4వేలు

ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఒక్కో ఓటుకు రూ.4వేలు పంచినట్లు ఆరోపణలున్నాయి. కాగా, సినిమాలు, సీరియళ్లూ చేసుకుంటున్న రాధికకు ఇప్పుడు ఈ ఐటీ దాడులు దిగ్భ్రాంతికి గురిచేశాయట. అయితే, రాడాన్ టీవీ కార్యాలయంలో అక్రమంగా బయటపడ్డ డబ్బు ఎంతన్నది తేలాల్సి ఉంది.

రాధిక కార్యాలయంలో సోదాలు..

రాధిక కార్యాలయంలో సోదాలు..

బుధవారం కూడా రాధిక రాడాన్ ఛానల్ కార్యాలయంలోనూ, శరత్ కుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగితున్నాయి. రూ. 7కోట్లు పంచినట్లు తేలడంతో మరోసారి శరత్ కుమార్ నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి విజయభాస్కర్ నుంచే రూ.7కోట్లు ఛానల్ కార్యాలయానికి ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాట్సప్ మెసేజ్‌లే కీలకం

వాట్సప్ మెసేజ్‌లే కీలకం

ఈ క్రమంలో మంత్రి విజయభాస్కర్, శరత్ కుమార్‌ల మధ్య జరిగిన వాట్సప్ సందేశాలే కీలకం కానున్నాయని తెలుస్తోంది. కాగా, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.

90కోట్లు పంచేశారు..

90కోట్లు పంచేశారు..

అధికార పార్టీ నంుచి పోటీకి దిగిన దినకరన్ ఎలాగైన ఉప ఎన్నికలో గెలవాలనే ఉద్దేశంతో రూ.90కోట్ల వరకూ ఓటర్లకు పంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాక, డబ్బులు పంచారంటూ 9మంది మంత్రులపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు.

English summary
Income tax investigation wing has done searches in Radaan Media works and captured some important documents. They also searched in Kottivakkam house and enquired about documents captured in Radaan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X