వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాగ్రత్త! నగదు లావాదేవీ రూ.2 లక్షలు దాటితే, అంతే మొత్తం పెనాల్టీ, ఐటీ హెచ్చరిక

భారీ నగదు లావాదేవీలు జరిపే వారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారీ నగదు లావాదేవీలు జరిపే వారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

అంతేకాదు, ఈ విధమైన భారీ నగదు లావాదేవీల సమాచారం తెలిస్తే blackmoneyinfo@ incometax.gov.in ద్వారా తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది.

new-notes

2017-18 కేంద్ర బడ్జెట్‌లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు.

దీనికి లోక్‌సభ తన ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్‌ 269ఎస్‌టిని చేర్చారు. దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం.

అంతేకాదు, ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం కూడా చట్ట విరుద్ధం. అయితే బ్యాంకులు, పోస్టాఫీసులు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలు స్వీకరించే మొత్తాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

English summary
The Income Tax Department today warned people against carrying out cash transaction of Rs. 2 lakh or more, saying the receiver will have to pay an equal amount as penalty. The I-T department said informers can email the department to blackmoneyinfoincometax.gov.in if they know of any such transaction. http://mt.ndtv.com/cms/belly-box-embed.txtThe government banned cash transactions of Rs. 2 lakh or more on April 1 through the Finance Act, 2017. The new Section 269ST in the Income Tax Act bans such cash transactions. "Contravention of Section 269ST would entail levy of 100 per cent penalty on receiver of the amount," the I-T Department said in advertisements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X