వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: భార్యను హత్య చేసి ఇంట్లో పూడ్చివేత, ఆ సమాచారమే కీలకం

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్:వివాహేతర సంబంధంతో భార్యను హత్య చేసి తాను అద్దెకున్న ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ఓ నిందితుడు.అంతేకాదు తన భార్య కన్పించడం లేదంటూ కుటుంబసభ్యులను పోలీసులను నమ్మించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకొంది.

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగిగా లోకేష్ చౌదరి పనిచేస్తున్నాడు. 2017 ఫిబ్రవరిలో మునేష్ అనే యువతితో వివాహమైంది. అయితే లోకేష్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు.

భార్య తనతో పాటే ఉంటే వివాహేతర సంబంధం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని భావించిన లోకేష్ భార్యను పోటీ పరీక్షలకు సిద్దం కావాలని కోచింగ్ కోసమంటూ జైపూర్‌కు పంపేశాడు.

వివాహేతర సంబంధం కోసం ఆ భర్త ఏం చేశాంటే

వివాహేతర సంబంధం కోసం ఆ భర్త ఏం చేశాంటే

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న లోకేష్‌కు మరో యువతితో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో లోకేష్ భార్యను పోటీ పరీక్షలకు సిద్దం కావాలని చెప్పి జైపూర్‌కు పంపారు. జైపూర్‌ హస్టల్‌లో మునేష్ ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యేది. అయితే ప్రియురాలి మోజులో పడిన లోకేష్ భార్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

 భార్యను పిలిచి హత్య

భార్యను పిలిచి హత్య

ఏప్రిల్ 11వ తేదిన హస్టల్‌లో ఉన్న భార్య మునేష్‌కు ఆమె భర్త లోకేష్ ఫోన్ చేశాడు. అర్జంటుగా బయలుదేరి రావాలని చెప్పాడు. ఇద్దరి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఆమెకు ఫోన్‌లో చెప్పాడు. అంతేకాదు తన జైపూర్ నుండి బయలుదేరగానే ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయాలని సూచించాడు. భార్య వడోదర చేరుకొన్నాక ఏప్రిల్ 12తేదిన భార్యను స్నేహితుడి సహయంతో హత్య చేశాడు.

ఇంట్లోనే మృతదేహం పూడ్చివేత

ఇంట్లోనే మృతదేహం పూడ్చివేత

మునేష్‌ను స్నేహితుడి సహయంతో హత్య చేసిన లోకేష్ తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే గొయ్యి తీసి ఆమెను పూడ్చిపెట్టాడు. అంతేకాదు తన భార్య కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన భార్య ఆచూకీ కనిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. మరోవైపు మునేష్ కుటుంబసభ్యులను కూడ నమ్మించాడు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి తన భార్యను తీసుకెళ్ళారని పోలీసులకు చెప్పాడు. అయితే లోకేష్ చెప్పిన ప్రాంతంలో పోలీసులు విచారణ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

మునేష్ రూమ్మేట్ ఇచ్చిన సమాచారంతో లోకేష్ అరెస్ట్

మునేష్ రూమ్మేట్ ఇచ్చిన సమాచారంతో లోకేష్ అరెస్ట్

ఏప్రిల్ 11వ తేదిన తాను మునేష్ కలిసి జ్యూస్ తాగేందుకు బయటకు వెళ్ళామని మునేష్ రూమ్మేట్ పోలీసులకు చెప్పారు. అయితే అత్యవసర పని ఉందని చెప్పి తన భర్త నుండి తనకు ఫోన్ వచ్చిందని మునేష్ రూమ్మేట్ పోలీసులకు చెప్పారు. ఈ ఫోన్ రాగానే ఆమె హస్టల్‌ నుండి భర్త వద్దకు బయలుదేరిందని ఆయన చెప్పారు. లోకేష్ ఫోన్‌లో డేటా డిలీట్ చేయడంపై కూడ పోలీసులు అనుమానించి ఆయనను విచారించారు. దీంతో తానే మునేష్‌ను హత్య చేసినట్టుగా లోకేష్ ఒప్పుకొన్నాడు. మృతదేహన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం పంపారు.

English summary
An income tax inspector posted in Vadodara has been arrested for allegedly killing his wife and burying her body over his affair with another woman, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X