వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల దెబ్బ: కర్ణాటక సీఎం సిద్దూ బంధువు ఇంటిలో ఐటీ సోదాలు, రూ. 191 కోట్లు అంటే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక సీఎం బంధువు ఇంటిలో ఐటీ సోదాలు: రూ. 191 కోట్లు సీజ్

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు నిఘా వేశారు. శనివారం కర్ణాటకలోని రెండు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. సీఎం సిద్దరామయ్య సమీప బంధువు, కర్ణాటక కనీస వేతనాల సలహా మండలి ( కర్ణాటక మినిమమ్ వేజ్ బోర్డు) అధ్యక్షుడు ఉమేష్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

షాక్ ఇచ్చిన ఐటీ

షాక్ ఇచ్చిన ఐటీ

చామరాజనగరలోని కోర్టు వీదిలోని ఉమేష్ ఇంటి ముందు శనివారం ప్రత్యక్షం అయిన 14 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు ఉమేష్ ఇంటికి డోర్ లాక్ చేసుకుని సోదాలు చేసి వివిద పత్రాలు పరిశీలిస్తున్నారు. సీఎం సిద్దరామయ్య బంధువు ఉమేష్ శాసన సభ్యుడు పుట్టరంగశెట్టికి చాల సన్నిహితుడు.

సీఎం మీద విమర్శలు

సీఎం మీద విమర్శలు

కర్ణాటక కనీస వేతనాల సలహా మండలి అధ్యుక్షుడిగా గతంలో ఎం. చిన్నస్వామి ఉన్నారు. అయితే కొన్ని కారణాల వలన ఎం. చిన్నస్వామి బహిరంగంగా సీఎం సిద్దరామయ్యను విమర్శించారు. ఆ సమయంలో సీఎం సిద్దరామయ్య ఎం. చిన్నస్వామిని పదవి నుంచి తప్పించి తన సమీప బంధువు ఉమేష్ ను నియమించారు.

జేడీఎస్ అభ్యర్థికి షాక్

జేడీఎస్ అభ్యర్థికి షాక్

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు వివిధ పార్టీల నాయకుల మీద నిఘా వేశారు. ఖానాపుర శాసన సభ నియోజక వర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాసీర్ భగవాన్ ఇంటిలో శనివారం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 రూ. 191 కోట్ల ఆస్తికి యజమాని

రూ. 191 కోట్ల ఆస్తికి యజమాని

శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాసీర్ భగవాన్ తన ఆస్తి రూ. 191 అని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు. ఇదే సమయంలో నాసీర్ భాగవాన్ ఇంటిలో 13 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తూ వివిద పత్రాలు పరిశీలిస్తున్నారు.

English summary
Income Tax officers raided chief minister Siddaramaiah's relative and karnataka minimum wage board president Umesh's house in Chamarajanagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X